మళ్ళీ హెచ్ 1-బీ వీసాల రద్దు యోచనలో ట్రంప్ !

ఉపాధి ఆధారిత హెచ్ 1 బీ వీసాల కోతపై మళ్ళీ  దృష్టి పెట్టారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. వివిధ వర్క్ వీసాలపై కొత్త ఆంక్షలను తాను ఒకటి,రెండు రోజుల్లో ప్రకటిస్తానని ఆయన ఈ నెల 20 న ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.

మళ్ళీ హెచ్ 1-బీ వీసాల రద్దు యోచనలో ట్రంప్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 22, 2020 | 6:48 PM

ఉపాధి ఆధారిత హెచ్ 1 బీ వీసాల కోతపై మళ్ళీ  దృష్టి పెట్టారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. వివిధ వర్క్ వీసాలపై కొత్త ఆంక్షలను తాను ఒకటి,రెండు రోజుల్లో ప్రకటిస్తానని ఆయన ఈ నెల 20 న ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ ఆంక్షలకు సంబందించి ఉత్తర్వులు జారీ అయిన పక్షంలో అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే సుమారు 2 లక్షల 40 వేల మంది ఆశలపై నీళ్లు చల్లినట్టే! అయితే.. ఇదివరకే తమ దేశంలో పని చేస్తున్నవారికి తన ఆంక్షలు వర్తించబోవని ట్రంప్ స్పష్టం చేశారు. హెచ్ 1-బీ ప్రోగ్రామ్ తో సహా వివిధ వీసా కేటగిరీలపై విధించనున్న నూతన నిబంధనల గురించి ప్రశ్నించినప్పుడు ఆయన.. కొన్ని మినహాయింపులు ఉంటాయన్నారు. ఈ వీసాతో బాటు మరికొన్ని కేటగిరీలకు సంబంధించి అమెరికాలో ప్రవేశించగోరే వారిని 180 రోజుల పాటు నిషేధించే అవకాశాన్ని ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి వీసాలు మంజూరై దేశం బయట పని చేస్తున్నవారు.. ఈ ఉత్తర్వుల కాలపరిమితి ముగిసేవరకు అమెరికాలో ప్రవేశించజాలరు. కరోనా వైరస్ ప్రబలంగా ఉంది గనుక తమ దేశంలోకి ప్రవేశించకుండా  తాత్కాలికంగా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ట్రంప్ ట్వీట్ చేశారు.