Breaking News
  • అమరావతి: ‘నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ–2020’ పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష: జాతీయ విద్యా విధానం–2020లో ఏం ప్రస్తావించారు? రాష్ట్రంలో ప్రస్తుత విద్యా విధానం ఎలా ఉంది? వంటి అన్ని అంశాలపై వివరించిన అధికారులు. సమీక్షలో సీఎం జగన్ మోహన్ రెడ్డి. అన్ని కాలేజీలు మూడేళ్లలో పూర్తి ప్రమాణాలు సాధించి ఎన్‌ఏసీ,ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ పొందాలి. కాలేజీల్లో ప్రమాణాలపై ఎస్‌ఓపీలు ఖరారు చేసి అన్ని కాలేజీలలో రెగ్యులర్‌గా తనిఖీలు చేయండి. 30 మందితో 10 బృందాలు ఏర్పాటు చేయండి టీచర్‌ ట్రెయినింగ్‌ కాలేజీలపై దృష్టి పెట్టండి. ప్రమాణాలు లేకపోతే నోటీసులు ఇవ్వండి మార్పు రాకపోతే ఆ కాలేజీలను మూసి వేయండి.
  • కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో ముగ్గురికి బెయిల్. ఎమ్మార్వో నాగరాజు పై మరో కేసు నమోదు కావడంతో బెయిల్ నిరాకరించిన ఏసీబీ కోర్ట్. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆంజిరెడ్డి, శ్రీనాథ్, విఆర్ఏ సాయి రాజ్ లకు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్ట్.
  • ట్రాయ్ కొత్త ఛైర్మన్‌గా పీడీ వాఘేలా నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.
  • సైబరాబాద్ కమిష్నరేట్ మొయినాబాద్ పొలిస్టేషన్ పరిధిలోని హిమయత్ నగర్ లో 25వ తేది అత్మహత్య చేసుకున్న ‌మహిళ కేసును చేదించిన మొయినాబాద్ పొలీసులు . అత్మహత్యకు కారకుడైనా భతుకు మధుసుధన్ యాదవ్ ను అదునులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు . కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.
  • ఏపీ హైకోర్టుని ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు. విమానాశ్రయం విస్తరణలో 31 ఎకరాల భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన కృష్ణంరాజు. తన పొలంలో ఉన్న పంటలు, నిర్మాణాలు ఇతరత్రా వాటి విలువ కలిపి నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ లో కోరిన కృష్ణంరాజు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు.
  • చెన్నై : ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన నటుడు కమహాసన్ . ప్రముఖ గాయకుడు ఎస్పీబీ కి భారత రత్న ఇవ్వాలని ప్రధాని కి లేఖ రాసిన ఏపీ సీఎం జగన్ . ఒక గొప్ప గాయకుడికి , మా అన్నయ కి తప్పకుండ ఈ గౌరవం దక్కాలని , తమిళనాడు లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కోరుకుంటున్నారని వెల్లడి . ఈ విషయం లో ముందడుగు వేసిన ఏపీ సీఎం జగన్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.
  • తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంచూ సందీప్ కు బెయిల్ మంజూరు చేసిన NIA కోర్ట్. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 2019 డిసెంబర్ లో అరెస్ట్ అయిన సందీప్.. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న సందీప్.. ప్రస్తుతం సందీప్ పై ఐదు కేసులు నమోదు చేసిన పోలీసులు. రేపు జైలు నుండి బయటకు రానున్న సందీప్.

అమెరికాలో టిక్‌టాక్‌ బ్యాన్‌.. సెప్టెంబర్ 15 డెడ్‌లైన్‌..!

చైనాకు చెందిన 'బైట్‌డాన్స్‌' 'టిక్‌టాక్‌'ను అమెరికాకు చెందిన ఏదైనా కంపెనీకి సెప్టెంబర్ 15 నాటికి విక్రయించాలని.. అదే చివరి డెడ్‌లైన్‌ అని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

September 15 TikTok Ban, అమెరికాలో టిక్‌టాక్‌ బ్యాన్‌.. సెప్టెంబర్ 15 డెడ్‌లైన్‌..!

September 15 TikTok Ban: అమెరికాకు చెందిన ఏదైనా కంపెనీకి ‘టిక్‌టాక్‌’ను విక్రయించాలని.. లేదంటే నిషేధం విధించేందుకు సిద్దంగా ఉన్నామని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనితో సాఫ్గ్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ ‘టిక్‌టాక్‌’ హక్కులను సొంతం చేసుకునేందుకు చర్చలు జరుపుతోంది. సెప్టెంబర్ 15 నాటికి ‘టిక్‌టాక్‌’ మాతృసంస్థ బైట్‌డాన్స్‌తో ఒప్పందం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ ధృవీకరించింది. ఈ నేపధ్యంలో డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు. చైనాకు చెందిన ‘బైట్‌డాన్స్‌’ ‘టిక్‌టాక్‌’ను అమెరికాకు చెందిన ఏదైనా కంపెనీకి సెప్టెంబర్ 15 నాటికి విక్రయించాలని.. అదే చివరి డెడ్‌లైన్‌ అని తెలిపారు. ఒకవేళ ఆ తేదీ దాటితే మాత్రం నిషేధం తప్పదని హెచ్చరించారు.

బైట్‌డాన్స్‌తో మైక్రోసాఫ్ట్ జరుపుతున్న చర్చలు గురించి మాట్లాడిన ట్రంప్.. కేవలం యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో ఉన్న 30 శాతం టిక్‌టాక్‌ నిర్వహణ బాధ్యతలను సొంతం చేసుకోవడం కాకుండా మొత్తం కంపెనీని బైట్‌డాన్స్ నుండి కొనుగోలు చేయాలని ట్రంప్ అన్నారు. ఇక డీల్ ఏదైనా కూడా అందులోని గణనీయమైన భాగాన్ని అమెరికన్ ట్రెజరీ డిపార్ట్మెంట్‌ ఖజానాకు పంపించాల్సి ఉంటుందని ట్రంప్ మరోసారి నొక్కి చెప్పాడు.

Also Read:

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

మహిళలకు గుడ్ న్యూస్.. ఆగష్టు 12న ‘వైఎస్ఆర్ చేయూత’కు శ్రీకారం..

”సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్య”!

సుశాంత్ చనిపోయే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసింది ఇవే.!

Related Tags