అన్నంత పనీ చేసిన ట్రంప్.. హెచ్-1బీ వీసాల ప్రక్రియ తాత్కాలికంగా రద్దు

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. హెచ్-1 బీ వీసా జారీ ప్రక్రియను 'సంస్కరించే యత్నం'లోభాగంగా ఈ సంవత్సరాంతం వరకు దీనిని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు..

అన్నంత పనీ చేసిన ట్రంప్.. హెచ్-1బీ వీసాల ప్రక్రియ తాత్కాలికంగా రద్దు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 23, 2020 | 11:01 AM

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. హెచ్-1 బీ వీసా జారీ ప్రక్రియను ‘సంస్కరించే యత్నం’లోభాగంగా ఈ సంవత్సరాంతం వరకు దీనిని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మెరిట్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ కి ‘స్వాగతం’ పలకాలని (అనుమతించాలని) తమ అధికారులను కోరారు. ఇతర వర్క్ వీసాలకు కూడా  ఈ రద్దు ప్రక్రియ వర్తిస్తుంది. ఇదే విషయాన్ని వైట్ హౌస్ ప్రకటించింది. అత్యధిక నైపుణ్యం గల సిబ్బందికి ప్రాధాన్యమిస్తూ.. అమెరికన్ ఉద్యోగులను పరిరక్షిస్తూ.. ఇందుకు ఉద్దేశించిన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను సంస్కరిస్తున్నట్టు ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. ఈ రిఫామ్స్ కింద హెచ్-1 బీ ప్రోగ్రామ్.. హయ్యెస్ట్ స్కిల్డ్ సిబ్బందిని, అత్యధిక వేతనాలతో ఆహ్వానించనుంది. అలాగే దేశంలో తక్కువ వేతనాలతో (నాన్-స్కిల్డ్) విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి యజమానులకు అవకాశమిస్తున్న నిబంధనల్లోని లొసుగులను కూడా తొలగించాలని ట్రంప్ నిర్ణయించారు. ఇవన్నీ ఎప్పుడో క్లింటన్ కాలం నాటి నాలుగంచెల రూల్స్ అని, వీటిని మార్చివేస్తున్నామని ఆయన అన్నారు. హెచ్-1 బీ ఉద్యోగుల వేతనాల ప్రక్రియను కూడా సంస్కరించనున్నారు.

కాగా-వర్క్ వీసాల తాత్కాలిక రద్దు వల్ల అమెరికాలో సుమారు 5.25 లక్షల మంది జాబ్స్ కోల్పోతారని అంచనా. హెచ్-1 బీ, హెచ్-4,హెచ్-2 బీ వీసా, జె అండ్ ఎల్ వీసాలతో బాటు పలు నాన్-ఇమ్మిగ్రేషన్ వీసాలను ఈ ఏడాది ఆఖరువరకు నిలిపివేయనున్నారు. అమెరికన్లు మళ్ళీ జాబ్స్ పొందేందుకు వీలుగా ట్రంప్ ఈ చర్యలు తీసుకున్నారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. కరోనా వైరస్ కారణంగా దేశం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని ఈ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..