‘జీ-7 సమ్మిట్ ను డిలే చేస్తా.. ఇండియానూ ఇన్వైట్ చేస్తా’….ట్రంప్

జూన్ నెలలో జరగవలసి ఉన్న జీ-7 సమ్మిట్ ను జాప్యం చేస్తానని, ఆ తరువాత దీన్ని నిర్వహించినప్పుడు రష్యాతో బాటు ఇతర దేశాలను కూడా ఆహ్వానిస్తానని అమెరికా అధ్యక్ధుడు ట్రంప్ ప్రకటించారు..

'జీ-7 సమ్మిట్ ను డిలే చేస్తా.. ఇండియానూ ఇన్వైట్ చేస్తా'....ట్రంప్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 31, 2020 | 1:19 PM

జూన్ నెలలో జరగవలసి ఉన్న జీ-7 సమ్మిట్ ను జాప్యం చేస్తానని, ఆ తరువాత దీన్ని నిర్వహించినప్పుడు రష్యాతో బాటు ఇతర దేశాలను కూడా ఆహ్వానిస్తానని అమెరికా అధ్యక్ధుడు ట్రంప్ ప్రకటించారు. విస్తరించిన ఈ కూటమి సమ్మిట్ కి రష్యా సహా దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఇండియా దేశాలను కూడా ఇన్వైట్ చేస్తానని ఆయన తెలిపారు. ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను జీ-7 కూటమి సరిగా గ్రహించడం లేదని, స్పందించడంలేదని తను భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇది ‘కాలం చెల్లిన దేశాల బృందం’ గా మారిందని ఆయన అభివర్ణించారు. జీ-సెవెన్ సమ్మిట్ సెప్టెంబరులో జరగవచ్చు.. ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ సమావేశమయ్యేముందు గానీ.. ఆ తరువాత గానీ.. అన్నారాయన.

ఈ ఏడాది జీ-సెవెన్ దేశాల కూటమికి అమెరికా నేతృత్వం వహించవలసి ఉంది. కొవిడ్-19 కారణంగా ఈశిఖరాగ్ర సమావేశం జూన్ మాసాంతంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగాలని ప్రతిపాదించారు. క్యాంప్ డేవిడ్ లో ఈ సమ్మిట్ నిర్వహించనున్నారు. అమెరికాతో బాటు బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలతో ఈ కూటమి ఏర్పడింది. అంతర్జాతీయ ఆర్ధిక సహకారం, సమన్వయంపై చర్చించేందుకు ఉద్దేశించి ఈ కూటమి ఏర్పాటైంది.