భారత్-చైనా బోర్డర్ వివాదం, నేను పరిష్కరిస్తా, ట్రంప్

భారత్-చైనా బోర్డర్ వివాదం చాలా దారుణంగా ఉందని, మరీ చైనా అయితే మితి మీరి ప్రవర్తిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ దేశాల సరిహద్దు సమస్య గురించి ఉభయ దేశాల తోను మాట్లాడానని, దీని పరిష్కారానికి సాయపడేందుకు రెడీగా ఉన్నట్టు తెలిపానని ఆయన చెప్పారు.

భారత్-చైనా బోర్డర్ వివాదం, నేను పరిష్కరిస్తా, ట్రంప్
Follow us

| Edited By: Team Veegam

Updated on: Sep 15, 2020 | 8:14 PM

భారత్-చైనా బోర్డర్ వివాదం చాలా దారుణంగా ఉందని, మరీ చైనా అయితే మితి మీరి ప్రవర్తిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ దేశాల సరిహద్దు సమస్య గురించి ఉభయ దేశాల తోను మాట్లాడానని, దీని పరిష్కారానికి సాయపడేందుకు రెడీగా ఉన్నట్టు తెలిపానని ఆయన చెప్పారు. వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, ..’జోక్యం చేసుకుంటాం..హెల్ప్ చేస్తాం.. పొరుగునే ఉన్న ఈ దేశాలకు మళ్ళీ మళ్ళీ ఇదే విషయాన్ని స్పష్టం చేశాం అన్నారు. లడాఖ్ లో చైనా ఆక్రమణల నేపథ్యంలో ఇండో-చైనా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇక ‘పెద్దన్న’ తరహాలో ట్రంప్ సీన్ లోకి అడుగు పెట్టారు. మీకు నేనున్నా అన్నట్టు భరోసా ఇస్తున్నారు. అసలే చైనా అంటే మండిపడుతున్న ట్రంప్ ఇదే అవకాశంగా వినియోగించుకున్నారు.

ఆ మధ్య భారత-పాకిస్థాన్  దేశాల మధ్య జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కారానికి నేను జోక్యం చేసుకుంటానంటూ ఆయన ముందుకు వచ్చారు. అయితే ఇది మా అంతరంగిక సమస్య అని, మేమే సాల్వ్ చేసుకుంటామని ఇండియా పదేపదే చెబుతూ వచ్చింది. దీంతో ట్రంప్ ‘డ్ డీలా పడిపోయారు’.