Breaking News
 • సిద్దిపేట: దేశానికి ఆదర్శంగా గజ్వేల్‌ నిలువబోతోంది. గజ్వేల్‌లో సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి. రూ.కోట్లతో నిర్మించిన కార్యాలయాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు-హరీష్‌రావు.
 • ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై కార్యదర్శి జలీల్‌ ప్రెస్‌మీట్‌. అధిక పరీక్ష ఫీజులు వసూలు చేసిన మూడు కాలేజీలు దసరాసెలవుల్లో తరగతులు నిర్వహించిన కాలేజీలకు నోటీసులు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. హాల్‌ టికెట్లపై ఏ సమస్య ఉన్నా భయపడొద్దు. ఏదైనా సమస్య ఉంటే బోర్డును సంప్రదించాలి. Tsbie.gov.inలో విద్యార్థులు తమ వివరాలు చెక్‌చేసుకోవచ్చ -ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి ఉమర్‌ జలీల్‌
 • రేపు ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు. పెరిగిన ఆర్టీసీ చార్జీలకు నిరసనగా ఆందోళనలు. ఆర్టీసీ డిపోల ఎదుట నిరసనలకు పిలుపు నిచ్చిన టీడీపీ
 • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం శ్రీవారి ఉచిత దర్శనానికి 7 గంటల సమయం. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.73 కోట్లు.
 • విశాఖ: రైల్వే ఈ-టికెట్లు బ్లాక్‌ చేస్తున్న ముఠా గుట్టురట్టు. దువ్వాడ, తాటిచెట్లపాలెంలో ఆర్పీఎఫ్‌ దాడులు ఈ-టికెట్లు బ్లాక్‌ చేస్తున్న ఇద్దరు అరెస్ట్‌. రూ.14.89 లక్షల విలువైన ఈ-టికెట్లు సీజ్‌. కటక్‌కు చెందిన సమీర్‌కుమార్‌ ప్రధాన్‌, దుర్గారావు అరెస్ట్‌. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేస్తున్న నిందితులు ల్యాప్‌టాప్‌, డాక్యుమెంట్లు సీజ్‌చేసిన ఆర్పీఎఫ్‌
 • కర్నూలు: నంద్యాలలో మందుబాబుల వీరంగం. పబ్లిక్‌గా మద్యం సేవిస్తున్న యువకులు. అడ్డుచెప్పిన మస్తాన్‌ వలీ అనే వ్యక్తిపై రాళ్లదాడి మస్తాన్‌వలీకి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
 • వరంగల్‌: హన్మకొండలో గుంతలరోడ్డుకు యువతి బలి. హంటర్‌రోడ్డులో గుంతలో పడి విద్యార్థిని బైక్‌ బోల్తా. రాంపూర్‌కు చెందిన విద్యార్థిని బ్లెస్సీ అక్కడికక్కడే మృతి.

జుగల్బందీ భేటీలో ఎవరు ఎవరికి ప్లాంక్ కార్డు ?

trump-modi-who-benefits-more-with-houston-meet, జుగల్బందీ భేటీలో ఎవరు ఎవరికి ప్లాంక్ కార్డు ?

హ్యూస్టన్ సదస్సే ఇపుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం. మోడీ, ట్రంప్ ప్రపంచాధినేతలుగా నిలిచిన హ్యూస్టన్ భేటీపై యావత్ ప్రపంచం ఆశ్చర్యానికి గురైంది. పలు దేశాధినేతలు సైతం తమ తమ అజెండాలను పక్కన పెట్టి సుమారు రెండు గంటల పాటు జరిగిన హ్యూస్టన్ సదస్సునే కళ్ళార్పకుండా చూశారంటే ఈ భేటీ ఎంతటి అటెన్షన్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. పోప్ తర్వాత ఒక విదేశీయునికి ఇలాంటి స్టాండింగ్ ఏవియేషన్ దక్కిందంటే అది ఒక్క నరేంద్ర మోదీకే. ఒక అమెరికా అధ్యక్షుడు ఒక విదేశీ ప్రభుత్వాధినేత కార్యక్రమానికి హాజరవడం కూడా చరిత్రలో ఇదే తొలిసారి. ట్రంప్ హాజరు కావడం ఒక ఎత్తైతే.. ఆయనే స్వయంగా నరేంద్ర మోదీని ఆకాశానికెత్తేలా పొగడ్డం మరింత ఆశ్చర్యానికి గురిచేసే అంశం. అదే సమయంలో మోదీ సైతం తన ప్రసంగంలో నాలుగైదు నిమిషాల పాటు ట్రంప్ ని పొగిడేందుకే కేటాయించారు. మొత్తానికి ఈ భేటీ ద్వారా ఇద్దరు అధినేతలు తమ తమ పర్సనల్ అజెండాలను తమదైన శైలిలో తెర మీదికి తెచ్చారు.. తమ తమ వ్యూహాలను అత్యంత వ్యూహాత్మకంగా అమల్లోకి తెచ్చారు. ఇంతకీ ఈ భేటీలో ఎవరి వ్యూహం ఏంటి ?

trump-modi-who-benefits-more-with-houston-meet, జుగల్బందీ భేటీలో ఎవరు ఎవరికి ప్లాంక్ కార్డు ?

ముందుగా మోదీ వ్యూహమేంటో చూద్దాం. రెండో సారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ దూకుడు పెంచిన సంగతి తెల్సిందే. ముందుగా ట్రిపుల్ తలాక్ పై తాను అనుకున్నది చేసేసారు మోదీ. ఆ తర్వాత కాశ్మీర్ ని విభజిస్తూ ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుని కఠిన నిర్ణయాలను తీసుకోవడంలో తాను ఎంత స్ట్రాంగ్ లీడరో ప్రపంచానికి చాటారు. కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని, ఈ విషయంలో పాకిస్తాన్ చేయగలిగిందేమీ లేదని గట్టిగానే చాటారు. అదే సమయంలో కాశ్మీర్లో తీవ్ర నిర్బంధ పరిస్థితులను ఇంపోజ్ చేసి, మీడియాని నియంత్రించి ఇందిరా గాంధీ తర్వాత అంతటి ఉక్కు సంకల్పం తనదని చాటుకున్నారు మోదీ. అంతర్జాతీయంగా పాకిస్తానుకు ఎలాంటి మద్దతు దొరక్కుండా తనదైన శైలిలో చక్రం తిప్పారు మోదీ. సరిగ్గా ఇలాంటి కీలక సమయంలో జరిగిన హ్యూస్టన్ భేటీని కూడా మోదీ చాల చాకచక్యంగా వినియోగించుకున్నారు. అందరికి ట్రంప్ ని పొగిడింది మాత్రమే కనిపించింది కానీ, పాకిస్తాన్ పేరు గాని ఇమ్రాన్ ఖాన్ పేరును గాని ప్రస్తావించకుండా ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా అభివర్ణిస్తూ ప్రపంచ యవనికపై ఆ దేశానికి అండా దండా ఉండకూడదని పరోక్షంగా చాటారు. ఈ కామెంట్స్ అన్నీ సాక్షాత్తూ అమెరికా ప్రెసిడెంట్ ముందు చేయడం ద్వారా ఇద్దరికి అభిమతం ఒక్కటే అని చాల గట్టిగా సందేశాన్నిచ్చారు మోదీ. ఇక్కడ మరో ప్రధాన మైన అంశం భారత ఆర్థిక వ్యవస్థ. గత కొద్దిరోజులుగా పడిపోతున్న జిడిపిపై విపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నాయి. ఈ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇవ్వడం ప్రధానిగా మోదీ బాధ్యత. అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ భారీ స్థాయిలో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా వెళ్లారు. దీనికి హ్యూస్టన్ వేదికను అత్యంత పక్కాగా వాడుకున్నారు. 50 వేల మంది ప్రవాసాంధ్రులు హాజరైన హ్యూస్టన్ సదస్సులో దేశ భక్తిని రగిల్చడంలో మోదీ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. లోక నాయకుడుగా తనను తాను చాటుకోవడంతో పాటు కాశ్మీర్ అంశంలో అంతర్జాతీయ మద్దతు, పాకిస్తాన్ను ఏకాకిని చేయడం, భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడం.. ఇలాంటి వ్యూహంతో వెళ్లిన మోదీ… ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టుగానే ప్రస్తుతానికి కనిపిస్తోంది.

trump-modi-who-benefits-more-with-houston-meet, జుగల్బందీ భేటీలో ఎవరు ఎవరికి ప్లాంక్ కార్డు ?

ఇక ట్రంప్ కోణంలో చూస్తే ఆయనకిపుడు రెండో సారి అధ్యక్ష బాధ్యతలను చేపట్టడమే లక్ష్యం. ఇందుకోసం ఆయనకొక ప్రవాస భారతీయుల వోట్ చాలా అవసరం ఆయనకు. అందుకే భారత్ తమకు అత్యంత ఆప్తమైన మిత్ర దేశమని ట్రంప్ ఇటీవల కాలంలో పదే పదే చాటుతున్నారు. హ్యూస్టన్ వేదిక నుంచి మోదీని ఆకాశానికి ఎత్తేయడం ద్వారా అయన అమెరికన్ భారతీయుల ఓట్లకు పెద్ద కాలమే వేశారు. “అబ్ కీ బారీ ట్రంప్ సర్కార్” అనడం ద్వారా మోదీ.. డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పరోక్షంగా భాగస్వామికి అయ్యారు. అధ్యక్షునిగా ఉన్న వ్యక్తి ఒక విదేశీయుని కార్యక్రమానికి తన ప్రోటోకాల్ ని సైతం పక్కన పెట్టి హాజరయ్యారంటే దాని వెనుక బలమైన కారణమే ఉండి ఉంటుందని అందరు భావించారు .. అనుకున్నట్టే మోదీ మద్దతు పొందండం ద్వారా తన రాక వెనుక ఆంతర్యాన్ని, వ్యూహాన్ని చాటుకున్నారు.. అనుకున్నది సాధించారు మోదీ.

trump-modi-who-benefits-more-with-houston-meet, జుగల్బందీ భేటీలో ఎవరు ఎవరికి ప్లాంక్ కార్డు ?

నిజానికి అమెరికా, ఇండియాల మధ్య వాణిజ్యఅంశాలు ఒకింత సున్నితంగానే ఉన్నాయి. అయితే హ్యూస్టన్ భేటీలో ఆ అంశాన్ని ఇద్దరు అధినేతలు ప్రస్తావించకుండా వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. అయితే ద్వైపాక్షిక చర్చల్లో ఈ కీలక అంశంపై క్లారిటీ రాకపోతే హ్యూస్టన్ భేటీ ద్వారా ఇద్దరు కూడా గట్టుకున్న ఛరిష్మాకు బీటలు వారక తప్పదు. అదే సమయంలో మోదీ పరోక్షంగా పాకిస్తాన్ ను విపరీతంగా ఎండగట్టిన ట్రంప్ ఆ అంశం జోలికి వెళ్ళలేదు. అంటే పాకిస్తాన్ విషయంలో అమెరికాది ద్వంద విధానమేనా? అన్న సందేహాలకు ట్రంప్ ఆస్కారమిచ్చారు. ఈ అంశం కూడా ద్వైపాక్షిక చర్చల్లో ఇదమిత్తంగా తేలకపోతే ఇరు దేశాల సంబంధాలు అనుకున్నంత బెటర్ గా ఏమీ లేవన్న విశ్లేషణలకు తావు ఇచ్చినట్లవుతుంది.  మొత్తానికి ఈ హ్యూస్టన్ భేటీ ద్వారా ఎవరు ఎవరికి ప్లాంక్ కార్డు గా ఉపయోగపడ్డారు ? తమ అజెండాలను పూర్తి స్థాయిలో అమలు పరిచి సక్సెస్ అయ్యారు ? ఇది కొంత కాలానికి గానీ తెలియదు..   Let us see how both legends continue this legacy !!