మోదీ-ట్రంప్ మధ్య ‘ ఆ మందు’.. ఇండియా తలవంచిందా ?

కరోనా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందును తమకు పంపాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ ను కోరిన కొన్ని గంటల్లోనే ఈ మెడిసిన్ ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం పాక్షికంగా ఎత్తివేసింది. 

మోదీ-ట్రంప్ మధ్య ' ఆ మందు'.. ఇండియా తలవంచిందా ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 08, 2020 | 1:06 PM

కరోనా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందును తమకు పంపాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ ను కోరిన కొన్ని గంటల్లోనే ఈ మెడిసిన్ ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం పాక్షికంగా ఎత్తివేసింది.  ఇండియా ఈ మందును తమకు ఇవ్వకపోతే ప్రతీకార చర్యకు దిగవచ్ఛునని ట్రంప్ చేసిన హెచ్చరిక ఇండియాపై ప్రభావం చూపిందా ? వైట్ హౌస్ లో ఆయన ఈ మేరకు చేసిన ప్రకటనతో ఇండియా తలవంచిందా ? అందుకే అత్యవసర మందులను ‘మరీ అవసరం’ ఉన్న దేశాలకు పంపేందుకు రెడీ అయిందా ? అంటే.. ఇక్కడ మానవతా అవసరాలను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అమెరికాలో కరోనా రోగులు నానాటికీ మరణిస్తుండడం, అది చూపుతున్న బీభత్సానికి ఇండియాకు మిత్ర దేశమైన అమెరికా తల్లడిల్లిపోవడం చూసి.. స్పందించి ప్రభుత్వం.. ఈ మందు ఎగుమతిపై ఉన్న ఆంక్షలను పాక్షికంగా ఎత్తివేసినట్టు కనిపిస్తోందని అంటున్నారు. ఇండియాలో హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు సుమారు 70 శాతం ఉత్పత్తి అవుతోంది. దీంతో బాటు పారాసిటిమాల్ టాబ్లెట్ల ఉత్పత్తి కూడా గణనీయంగానే ఉంది.

నిజానికి హైడ్రాక్సీక్లోరోక్విన్ మెడిసిన్ కరోనా వ్యాధి చికిత్సలో సురక్షితమైనదని, మంచిదని ఫుడ్ అండ్ డ్రగ్ విభాగం ధృవీకరించలేదు. పైగా ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఈ విషయాన్ని అంగీకరించడానికి నిరాకరించారు. అనేక దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తిగా ఈ అంశాన్ని నిర్ధారించలేదు కూడా. ఈ మందు వినియోగాన్ని ప్రోత్సహించడంపై మరింత అధ్యయనం జరపవలసిన అవసరం ఉందని వైట్ హౌస్ లో కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు ఆంథోనీ ఫోసీ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. అమెరికాతో తమ దేశానికి గల ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలోనూ, ట్రంప్ కు, ప్రధాని మోదీకి మధ్య గల స్నేహం , సఖ్యతల కారణంగాను ఈ మెడిసిన్ ని యుఎస్ కి కూడా పంపాలని భారత్ నిర్ణయించినట్టు కనబడుతోందని నిపుణులు అంటున్నారు. కోవిడ్-19 విశ్వవ్యాప్తమైన వేళ.. ఆయా దేశాలమధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బ తినకుండా చూడడానికి నిషేధం పాక్షిక సడలింపు ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావించిందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..