రేపటి నుంచి మళ్ళీ ప్రచార కార్యక్రమాల్లో ట్రంప్ బిజీ

అమెరికా అధ్య,క్షుడు ట్రంప్ శనివారం నుంచి మళ్ళీ ప్రచార కార్యక్రమాల్లో బిజీ కానున్నారు. ఇటీవల కోవిడ్ కి గురై మూడు, నాలుగు రోజులు ఆసుపత్రిలలో చికిత్స పొందిన ఆయన కోలుకుని ప్రచార కార్యక్రమాలు, మీడియా మీట్లలో తలమునకలయ్యారు.

రేపటి నుంచి మళ్ళీ ప్రచార కార్యక్రమాల్లో ట్రంప్ బిజీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 09, 2020 | 1:00 PM

అమెరికా అధ్య,క్షుడు ట్రంప్ శనివారం నుంచి మళ్ళీ ప్రచార కార్యక్రమాల్లో బిజీ కానున్నారు. ఇటీవల కోవిడ్ కి గురై మూడు, నాలుగు రోజులు ఆసుపత్రిలలో చికిత్స పొందిన ఆయన కోలుకుని ప్రచార కార్యక్రమాలు, మీడియా మీట్లలో తలమునకలయ్యారు. ఆయన ఆరోగ్యం ఇప్పుడు భేషుగ్గా ఉందని, ఇక ఈ విధమైన ఈవెంట్లలో ఆయన నిరాటంకంగా పాల్గొనవచ్చునని   ట్రంప్ డాక్టర్ సీన్ కాన్లే తెలిపారు. అయినా ట్రంప్ హెల్త్ పై తను సదా దృష్టి పెడుతున్నానన్నారు. ఇంకేం ? ట్రంప్ ఇక తిరిగి రంగంలోకి దూకుతానని ప్రకటించారు. శనివారం ఫ్లోరిడాలో, ఆదివారం పెన్సిల్వేనియాలో జరిగే ప్రచార ఈవెంట్లలో నేను పాల్గొనే ఛాన్స్ ఉందని చెప్పారు. ట్రంప్ కి ఇంకా కోవిడ్ ఉంటే సెకండ్ డిబేట్ రద్దు చేస్తే మంచిదేమో అని డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ ఈ మధ్యే వ్యాఖ్యానించారు. అయితే ఆయనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ట్రంప్ గారు తానిక పలు రాష్ట్రాల్లో టూర్లు వేసే అవకాశం ఉందని చెబుతున్నారు.