‘మీరు చాలా గ్రేట్..’ ఇండో-అమెరికన్ శాస్త్రవేత్తలకు ట్రంప్ ప్రశంస

భయంకర కరోనా వ్యాధి చికిత్స కోసం మందులు, వ్యాక్సీన్లను అభివృధ్ది చేయడానికి ఇండో-అమెరికన్ శాస్త్రవేత్తలు, పరిశోధకులు చేస్తున్న కృషిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమ దేశం ఇండియాతో కలిసి ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని ఆయన చెప్పారు. అమెరికాలో భారతీయ జనాభా చాలా ఉందని, వీరిలో చాలామంది వ్యాక్సీన్ గురించి మాట్లాడడం హర్షణీయమని అన్నారు. వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఆప్యాయంగా ఇండో అమెరికన్ […]

'మీరు చాలా గ్రేట్..' ఇండో-అమెరికన్ శాస్త్రవేత్తలకు ట్రంప్ ప్రశంస
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 16, 2020 | 5:51 PM

భయంకర కరోనా వ్యాధి చికిత్స కోసం మందులు, వ్యాక్సీన్లను అభివృధ్ది చేయడానికి ఇండో-అమెరికన్ శాస్త్రవేత్తలు, పరిశోధకులు చేస్తున్న కృషిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమ దేశం ఇండియాతో కలిసి ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని ఆయన చెప్పారు. అమెరికాలో భారతీయ జనాభా చాలా ఉందని, వీరిలో చాలామంది వ్యాక్సీన్ గురించి మాట్లాడడం హర్షణీయమని అన్నారు. వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఆప్యాయంగా ఇండో అమెరికన్ రీసెర్చర్లను ఆకాశానికెత్తేశారు. కరోనాపై ట్రంప్ ప్రభుత్వం జరుపుతున్న పోరును ఇండియన్ అమెరికన్లు ప్రశంసించిన వేళ.. ఆయన కూడా ఇలాగే స్పందించారు. వీరి  రీసర్చ్ టాలెంట్ ని ఆయన పొగడడం ఇదే మొదటిసారి.

అమెరికాలోని నేషనల్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ హెల్త్ తో సహా పలు యూనివర్సిటీలు, రీసెర్చ్ సంస్థలు, బయో ఫార్మా కంపెనీల్లో అనేకమంది రీసెర్చర్లు పని చేస్తున్నారు. ఈ దేశంలో 40 లక్షల మంది ఇండో-అమెరికన్లు ఉన్నారని అంచనా. వీరిలో సుమారు 25 లక్షల మంది ఈ ఏడాది నవంబరు నెలలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ట్రంప్ సాయానికి థ్యాంక్స్.. మోదీ

కరోనాను ఎదుర్కొనేందుకు భారత దేశానికి వెంటిలేటర్లు అందజేస్తామని ట్రంప్ చేసిన ప్రకటన పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. కరోనాపై జరిపే యుధ్ధంలో ఇలా అన్ని దేశాలూ  కలిసి కట్టుగా చేతులు కలపడం ఎంతో ముఖ్యమని, భారత-అమెరికా స్నేహానికి మరింత ‘శక్తి’ లభిస్తుందని మోదీ పేర్కొన్నారు.