ట్రంప్ కి కాస్త నయమే, కానీ, ఇంకా కోవిడ్ ‘ముప్పులోనే’ !

కోవిడ్-19 కి గురైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం మెరుగు పడుతోందని, అయితే మరో రెండు రోజులు కాస్త ఆందోళనకరంగానే ఉండవచ్చునని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన వాల్టర్ రీడ్ మిలిటరీ ఆసుపత్రిలో..

ట్రంప్ కి కాస్త నయమే, కానీ, ఇంకా కోవిడ్ 'ముప్పులోనే' !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 04, 2020 | 1:00 PM

కోవిడ్-19 కి గురైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం మెరుగు పడుతోందని, అయితే మరో రెండు రోజులు కాస్త ఆందోళనకరంగానే ఉండవచ్చునని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన వాల్టర్ రీడ్ మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్ లో అడ్మిట్ కాకముందు ఆయన  వైట్ హౌస్ లో స్వల్ప మోతాదులో ఆక్సిజన్ చికిత్స పొందారని ఆలస్యంగా తెలిసింది. అయితే వైద్యులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. అటు-ట్రంప్ శనివారం ఆసుపత్రిలోని తన సూట్ నుంచే ఓ వీడియోను రిలీజ్ చేస్తూ, ఇప్పుడు బెటర్ గా ఫీలవుతున్నానని, డాక్టర్లు ప్రయోగాత్మకంగా ఇస్తున్న మందులు దేవుడిచ్చిన  మిరాకిల్స్ అని వ్యాఖ్యానించారు త్వరలో తను పూర్తిగా కోలుకోగలనన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. . తన భార్య మెలనియా తనకన్నా వయస్సులో చిన్నది గనుక త్వరగా కోలుకుంటోందని చిన్న జోక్ వేశారు. ఏమైనా… ట్రంప్ ఆసుపత్రిలోనే కొన్ని రోజులు చికిత్స పొందవలసి రావచ్ఛునని కూడా భావిస్తున్నారు.