ట్రంప్ అభిశంసన.. ఇక బహిరంగ విచారణలకు శ్రీకారం !

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన వ్యవహారం కీలక దశకు చేరుకుంది. తన అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేసినందుకు ఆయనను అభిశంసించాలంటూ డెమొక్రాట్లు తీర్మానాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం మేజర్ న్యూస్ నెట్  వర్క్ లలో లైవ్ గా ప్రసారం కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ల శకంలో ఇది తొలి ఇంపీచ్ మెంట్ వ్యవహారం. అంటే ఎవరైనా, ఎక్కడినుంచయినా దీన్ని వాచ్ చేయవచ్చు. బుధవారం పబ్లిక్ హియరింగ్స్ ప్రారంభమవుతున్నాయి. హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ […]

ట్రంప్ అభిశంసన.. ఇక బహిరంగ విచారణలకు శ్రీకారం !
Follow us

|

Updated on: Nov 13, 2019 | 2:30 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన వ్యవహారం కీలక దశకు చేరుకుంది. తన అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేసినందుకు ఆయనను అభిశంసించాలంటూ డెమొక్రాట్లు తీర్మానాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం మేజర్ న్యూస్ నెట్  వర్క్ లలో లైవ్ గా ప్రసారం కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ల శకంలో ఇది తొలి ఇంపీచ్ మెంట్ వ్యవహారం. అంటే ఎవరైనా, ఎక్కడినుంచయినా దీన్ని వాచ్ చేయవచ్చు. బుధవారం పబ్లిక్ హియరింగ్స్ ప్రారంభమవుతున్నాయి. హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ తన మొట్టమొదటి టెలివైజ్డ్ విచారణను మొదలుపెట్టబోతోంది.

ఈ వారంలో ముగ్గురు దౌత్యవేత్తలు.. ఉక్రెయిన్ కి తాత్కాలిక రాయబారి విలియం బీ.టేలర్ జూనియర్, యూరోపియన్ యురేషియన్ వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జార్జ్ కెంట్, ఉక్రెయిన్ కి మాజీ అమెరికా రాయబారి మేరీ ‘ మాషా ‘ యునోవిచ్ తమ వాంగ్మూలాలు ఇవ్వనున్నారు. 13 మంది డెమొక్రాట్లు, 9 మంది రిపబ్లికన్లు.. మొత్తం 22 మంది హౌస్ మెంబర్లతో కూడిన కమిటీ లాంగ్ వర్త్ హౌస్ ఆఫీస్ కార్యాలయంలో సమావేశమై ఈ హియరింగ్ ను పర్యవేక్షించనుంది. అసలు కథేమిటి ? 2020 లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తనకు పోటీగా బరిలో నిలుస్తున్న డెమొక్రటిక్ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బిడెన్ జూనియర్ అవినీతిపై విచారణ జరిపి.. తనకు సాయం చేయాలంటూ ట్రంప్.. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్ స్కీ ని ఫోన్ లో కోరారట.. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ మేరకు ఇఛ్చిన సమాచారంతో డెమొక్రాట్లు.. ఇక రిపబ్లికన్ అయిన ఈ అధ్యక్షుడిని అభిశంసించే ప్రయత్నం మొదలు పెట్టారు. దీంతో ప్రతినిధుల సభలో ‘ లొల్లి ‘ మొదలైంది. గతంలో మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, రిచర్డ్ నిక్సన్ పైనా అభిశంసన తీర్మానాలు ‘ వెల్లువెత్తాయి.. కాగా- పబ్లిక్ హియరింగ్ సందర్భంగా ట్రంప్ ను సమర్థించేందుకు రిపబ్లికన్లు కూడా రెడీ అవుతున్నారు.