‘నా మీద కుట్ర’.. మీడియాపై ట్రంప్ ఫైర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాపై మళ్ళీ కస్సుమన్నారు. మీడియా తన పరిధిని అతిక్రమిస్తోందని, తనపై  కుట్ర చేస్తోందని ఆరోపించారు. సోమవారం వైట్ హౌస్ లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన.. సీబీఎస్, సీఎన్ఎన్ రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు మండిపడి మధ్యలోనే నిష్క్రమించారు. వారికి, ఆయనకు మధ్య వాడి,వేడి వాగ్యుధ్దం జరిగింది.  కరోనా వైరస్ తో అమెరికాలో 80 వేలకు పైగా రోగులు మరణించగా.. మీరు టెస్టింగుల విషయంలో ఉదాసీనంగా ఎందుకు ఉంటున్నారంటూ సీబీఎస్ రిపోర్టర్ […]

'నా మీద కుట్ర'.. మీడియాపై ట్రంప్ ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 12, 2020 | 3:55 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాపై మళ్ళీ కస్సుమన్నారు. మీడియా తన పరిధిని అతిక్రమిస్తోందని, తనపై  కుట్ర చేస్తోందని ఆరోపించారు. సోమవారం వైట్ హౌస్ లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన.. సీబీఎస్, సీఎన్ఎన్ రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు మండిపడి మధ్యలోనే నిష్క్రమించారు. వారికి, ఆయనకు మధ్య వాడి,వేడి వాగ్యుధ్దం జరిగింది.  కరోనా వైరస్ తో అమెరికాలో 80 వేలకు పైగా రోగులు మరణించగా.. మీరు టెస్టింగుల విషయంలో ఉదాసీనంగా ఎందుకు ఉంటున్నారంటూ సీబీఎస్ రిపోర్టర్ వీజియా జియాంగ్ ప్రశ్నించింది. ఇందుకు ట్రంప్ అసహనంగా…  ఈ ప్రశ్నను చైనానే అడగండి అనడంతో… చైనీస్ అమెరికన్ అయిన ఆమె..ట్రంప్ ను మరో ప్రశ్న వేయబోయింది. కానీ ఆయన ఆమెకు అవకాశం ఇవ్వకుండా.. సీఎన్ఎన్ రిపోర్టర్ ను ప్రశ్న అడగమని కోరారు. అయితే ఆ రిపోర్టర్ కూడా ఏదో అడగబోయేంతలో పూర్తిగా సహనం నశించిన ట్రంప్ మధ్యలోనే వెళ్లిపోయారు.

ఆ తరువాత ఆయన.. తన ట్విట్టర్ లో మీడియాను తిట్టిపోశారు. ‘వాళ్ళు (మీడియా) ఎలా కుమ్మక్కు అవుతున్నారో చూడండి.. వాళ్ళు ప్రజలకు శత్రువులు. కానీ భయపడకండి.. మేం నవంబరులో (అధ్యక్ష ఎన్నికల్లో) తప్పక గెలుస్తాం’ అని ఆయన ట్వీటించారు. లోగడ  కూడా ఈ అధ్యక్షులవారు తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలు, న్యూస్ ఛానెళ్ల మీద కారాలు, మిరియాలు నూరిన సంగతి తెలిసిందే.