Breaking News
  • కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ భారత్ అవార్డులలో తెలంగాణ రాష్ట్రం వరసగా నెంబర్ వన్ గా నిలవడం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు & ఆయన నిర్వహిస్తున్నశాఖల అధికారులు, ఉద్యోగులను, టీమ్ ను ట్విట్టర్ ద్వారా అభినందించిన KTR.. -CM KCR,KTRకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి.. -బంగారు తెలంగాణ సాధనలో భాగంగా, మీ సహకారం వల్లే ఇదంతా సాధ్యమైందని సీఎం కెసిఆర్ కు, కెటిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
  • అమరావతి: రేపటి ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా. అక్టోబర్ 8 న భేటీ అయ్యే అవకాశం.
  • విజయవాడ : ఆర్కియాలజి కమిషనర్ వాని మోహన్ కామెంట్స్ అక్టోబర్ ఒకటో వ తేదీన బాపు మ్యూజియం ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు. గత పదేళ్లుగా ముత పడిన మ్యూజియం రేపటి నుంచి పర్యాటకలకు అందుబాటులో కి రానుంది. ఏళ్ల తరబడి పొందుపరిచిన శిల్పాలు, రాతి కట్టుబడులు మ్యూజియం లో ఉన్నాయ్. బాపు మ్యూజియం లో ఇంటరాక్టివ్ కియోస్క్ ను అధునాతన టెక్నాలజీ తో అభివృద్ధి.
  • వైద్య, ఆరోగ్యశాఖ ఆస్పత్రులలో నాడు–నేడు పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష: నాడు–నేడు కార్యక్రమంలో ఆస్పత్రులలో చేపడుతున్న మార్పులతో పాటు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలల ప్రస్తుత పరిస్థితిని వివరించిన అధికారులు. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో వైద్య కళాళాలలకు సంబంధించి భూసేకరణతో పాటు, అవసరమైన అన్ని పనులు పూర్తయ్యాయని, టెండర్ల ఖరారుకు జ్యుడీషియల్‌ రివ్యూకు పంపిస్తున్నామని తెలిపిన అధికారులు.
  • సిఎం వైఎస్ జగన్ కామెంట్స్: అన్ని ఆస్పత్రులలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండాలి. వాటి నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అక్కడ కార్పొరేట్‌ లుక్‌ కనిపించాలి. చరిత్రలో నిల్చిపోయే విధంగా వాటి నిర్మాణం జరగాలి. మూడేళ్లలో అన్ని ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తి కావాలి. ఆ ఆస్పత్రులలో యంత్రాలు, ఏసీలు, లిఫ్ట్‌లు, ఎలక్ట్రికల్, నాన్‌ ఎలక్ట్రికల్‌ ఉపకరణాలు, ఫైర్‌ కంట్రోల్‌ ఎక్విప్‌మెంట్‌ వంటి అన్నింటి నిర్వహణ బాధ్యత ఏడేళ్ల పాటు అప్పగించాలి. తద్వారా ఏ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కారం అవుతుంది. ఆస్పత్రిలో ఓనర్‌షిప్‌ తీసుకోవాలి. తప్పనిసరిగా సెంట్రలైజ్డ్‌ ఏసీ ఉండాలి, డాక్టర్లు ఇబ్బంది పడకుండా ఉన్నప్పుడే వారు చక్కగా సేవలందించగలుగుతారు. అవసరం అయితే సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం, దాని వల్ల యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.2.50 కే వస్తుంది. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో ఆస్పత్రుల రూపురేఖలు మారబోతున్నాయి. అందువల్ల ప్రతి ఆస్పత్రి బెస్టుగా ఉండాలి.
  • అక్టోబర్ 4న జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదన్న యూపీఎస్సీ. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ను సమర్పించిన యూపీఎస్సీ. ఈ ఏడాది వాయిదా వేస్తే వచ్చే ఏడాది జూన్ 27న జరిగే పరీక్షపై ఆ ప్రభావం పడుతుందన్న యూపీఎస్సీ. పరీక్షకు హాజరయ్యే వారంతా పట్టభద్రులు, ఆపైబడిన వారేనని అఫిడవిట్ లో పేర్కొన్న యూపీఎస్సీ. వారంతా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని భావిస్తున్నామన్న యూపీఎస్సీ. కోవిడ్ సహా అన్ని ప్రోటోకాల్స్ పరిగణలోకి తీసుకొని ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన యూపీఎస్సీ. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల కోసం రూ.50.30 కోట్ల వ్యయం అయినట్లు తెలిపిన యూపీఎస్సీ. నేడు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేయాలన్న పిటిషన్ ను విచారించనున్న సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన 20 మంది యూపీఎస్సీ ఆశావహులు.

ఆమెకు సెనేట్ లో మర్యాదే లేదు, కమలా హారిస్ పై ట్రంప్

అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా సెనెటర్ కమలా హారిస్ ను తన ప్రత్యర్థి జో బిడెన్ ఎంపిక చేయడాన్ని అధ్యక్షుడు ట్రంప్ తప్పు పట్టారు. ఈ సెలెక్షన్ పట్ల ఆశ్చర్యం..

Trump Fire, ఆమెకు సెనేట్ లో మర్యాదే లేదు, కమలా హారిస్ పై ట్రంప్

అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా సెనెటర్ కమలా హారిస్ ను తన ప్రత్యర్థి జో బిడెన్ ఎంపిక చేయడాన్ని అధ్యక్షుడు ట్రంప్ తప్పు పట్టారు. ఈ సెలెక్షన్ పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యూఎస్ సెనేట్ లో ఆమెకు మర్యాదే లేదని, ఆమె ‘హారిబుల్’ సభ్యురాలని ఆరోపించారు. డెమొక్రాట్ నామినేషన్ కోసం ఆమె ప్రయత్నిస్తున్న తీరు తనను ఇంప్రెస్ చేయలేదని, ప్రైమరీల్లో ఆమెకు పేలవమైన స్పందన లభించిందని ట్రంప్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. యుఎస్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా  కమలా హారిస్ ని డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా-ఆమె ఎంపిక చరిత్రాత్మకమని, తొలి నల్లజాతి మహిళ, మొట్టమొదటి ఏషియన్ అమెరికన్ వుమన్ కూడా అయిన కమలా హారిస్ ఈ ఎన్నికల్లో విజయం సాధించగలరని ఆశిస్తున్నానని జో బిడెన్ అన్నారు. దేశంలో వర్ణ వివక్ష, జాత్యహంకారం పెట్రేగుతున్న ఈ తరుణంలో ఈమె సెలెక్షన్ మంచి మార్పునకు దారి తీస్తుందన్నారు. అటు-భారతీయ, జమైకా ఇమిగ్రెంట్ దంపతుల కూతురైన కమలా హారిస్ లోగడ శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా వ్యవహరించారు. దివంగతుడై న జోబిడెన్ కుమారునితో గతంలో ఈమె రిలేషన్ షిప్ లో ఉన్నారు. అది కూడా తన నిర్ణయంపై ప్రభావం చూపిందని జో బిడెన్ అంటున్నారు.

 

Related Tags