Breaking News
  • గాంధీ ఆసుపత్రి హౌస్ ఫుల్. కరోనా కేసులతో నిండిపోయిన గాంధీ ఆసుపత్రి. గాంధీలో 163 మంది కరోనా లక్షణాలతో అడ్మిట్. 70 పాజిటివ్ కేసులకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడిస్తున్న అధికారులు. నిండిపోయిన కేసులతో గాంధీలో వైద్యులు, సిబ్బందికి పెరిగిన పనిభారం.
  • గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై జరిగిన దాడిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఖండించారు. అలాగే నిజామాబాద్‌లో వైద్య సిబ్బందిని అడ్డుకోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిపారు కేటీఆర్‌. సంక్లిష్ట పరిస్థితుల్లో వైద్య సేవలను అందిస్తున్న వారిపై ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని ఊరికే వదలమని చెప్పారు.. తెలంగాణ ప్రభుత్వం ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తోందని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు కేటీఆర్‌.
  • నల్లగొండ జిల్లాలో తొలిసారిగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నల్లగొండలో 5, మిర్యాలగూడలో ఒక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పరిస్థితిని కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ అధికారులతో సమీక్షించారు.
  • అమరావతిరాజధానిలో అందరికీ ఇళ్ల పథకం వర్తింపుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం. అందరికీ ఇళ్ల పథకం అమలు కోసం అవసరమైన పక్షంలో సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ మార్పులు చేర్పులు చేయాలంటూ ఉత్తర్వులు. సీఆర్డీఏ చట్టం పరిధిలోనే మాస్టర్ ప్లానులో మార్పులుండాలని స్పష్టీకరణ. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పథకం అమలు చేసేలా ప్రక్రియ ప్రారంభించాలని గుంటూరు, కృష్ణా కలెక్టర్లకు ఆదేశాలు.
  • కరోనా వైరస్ ను ఎదర్కోవడంలో అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తీవ్రంగా విఫలమౌతున్నారని ఆరోపించారు డొమొక్రాట్ సీనియర్ నేత బెర్నీ సాండర్స్. ట్రంప్ అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రమాకర అధ్యక్షుడని ధ్వజమెత్తారు.

నా సభకు 70 లక్షల మంది వస్తేనే బెటర్.. ట్రంప్

Trump India Tour In February, నా సభకు 70 లక్షల మంది వస్తేనే బెటర్.. ట్రంప్

ఈ నెలాఖరులో తను జరపబోయే తొలి భారత పర్యటన పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. తన విజిట్ సందర్భంగా భారత-అమెరికా దేశాల మధ్య ఓ వాణిజ్య ఒప్పందం కుదరవచ్చునని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రధాని మోదీ ఆహ్వానంపై ట్రంప్ ఈ నెల 24-25 తేదీల్లో ఇండియాకు రానున్నారు. ఢిల్లీతో బాటు గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరాన్ని కూడా ఆయన సందర్శించనున్నారు. ఆ సిటీలోని భారీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో మోదీ, ట్రంప్ ఇద్దరూ సంయుక్తంగా ప్రసంగించనున్నారు. తన ఓవల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. మోదీ జెంటిల్ మన్.. ఆయనను సాధ్యమైనంత త్వరగా కలవాలని అనుకుంటున్నాను అని చెప్పారు. భారతీయులు (ప్రభుత్వం) ఏదో కోరుకుంటున్నారు.  మా భేటీ సందర్భంగా సరైన ఒప్పందమే కుదురుతుందని భావిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. గత మూడేళ్ళుగా ట్రంప్, మోదీ ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా మంచి సాన్నిహిత్యం పెరిగింది. గాఢ స్నేహితులయ్యారు. 2019 లో వీరు నాలుగు సార్లు సమావేశమయ్యారు.  హూస్టన్ లో 50 వేల మంది ప్రవాసాంధ్రులు హాజరైన బిగ్గెస్ట్ ఈవెంట్ కూడా వీటిలో ఉంది. ఆ కార్యక్రమంలో సంయుక్తంగా వీరు పాల్గొన్నారు. ఈ ఏడాది రెండు సార్లు ఫోన్లో మాట్లాడారు.

అహ్మదాబాద్ లో మీకు వెల్ కమ్ చెప్పడానికి వేలాది భారతీయులు సిధ్ధంగా ఉన్నారని మోదీ చెప్పారని, అయితే సాధారణంగా తమ దేశంలో తాను పాల్గొనే కార్యక్రమాలకు 40వేలనుంచి 50 వేల మంది ప్రజలు వస్తారని ట్రంప్ అన్నారు. ‘ మా దేశంలో లక్షలాది ప్రజలు ఉన్నారని మోదీ చెప్పారు. కానీ హూస్టన్ లో జరిగిన కార్యక్రమానికి 40 వేల మంది మాత్రమే హాజరయ్యారు. నాకిది సరైనదిగా తోచడంలేదు. అహ్మదాబాద్ లో విమానాశ్రయం నుంచి భారీ క్రికెట్ స్టేడియం వరకు కనీసం 50 లక్షల నుంచి 70 లక్షల వరకు జనాలు రావాలని నేను కోరుతున్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు. పైగా ఆ నగరంలో మోడీ నిర్మిస్తున్న అతి పెద్ద స్టేడియం అది అని తాను  విన్నానని ఆయన చెప్పారు. అహ్మదాబాద్ లోని మోతేరా స్టేడియాన్ని 100 మిలియన్ యుఎస్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. అక్కడ సుమారు లక్షమందికి చోటు ఉందట.. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో గల క్రికెట్ స్టేడియం కన్నా ఇది అతి పెద్దదని సమాచారం.కాగా ట్రంప్ చేయనున్న భారత పర్యటన పట్ల ప్రధాని మోదీ హర్షం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు .


Trump India Tour In February, నా సభకు 70 లక్షల మంది వస్తేనే బెటర్.. ట్రంప్

 

 

Related Tags