Namaste Trump: గాంధీజీ చరఖాతో నూలు వడికిన ట్రంప్ దంపతులు

భారత పర్యటనకు వచ్చిన ట్రంప్‌ దంపతులు ముందుగా అహ్మదాబాద్‌కు సమీపంలోని సబర్మతీ ఆశ్రమానికి వెళ్లారు. ప్రధాని మోదీ స్వయంగా వారిని ఆశ్రమానికి తీసుకువెళ్లారు. భారత స్వాతంత్ర్యపోరాటంలో సబర్మతీ ఆశ్రమం కీలకపాత్ర..

Namaste Trump: గాంధీజీ చరఖాతో నూలు వడికిన ట్రంప్ దంపతులు
Follow us

| Edited By:

Updated on: Feb 24, 2020 | 1:06 PM

Namaste Trump: భారత పర్యటనకు వచ్చిన ట్రంప్‌ దంపతులు ముందుగా అహ్మదాబాద్‌కు సమీపంలోని సబర్మతీ ఆశ్రమానికి వెళ్లారు. ప్రధాని మోదీ స్వయంగా వారిని ఆశ్రమానికి తీసుకువెళ్లారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో సబర్మతీ ఆశ్రమం కీలకపాత్ర పోషించిందని ట్రంప్‌ దంపతులకు వివరించారు. ముందుగా షూలు తీసి గాంధీజీ చిత్ర పటానికి పూల మాల వేశారు. అప్పట్లో గాంధీజీ తిప్పిన చరఖా తిప్పి ట్రంప్, మెలానియాలు నూలు వడికారు. ఆ తరువాత అక్కడున్న సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు ట్రంప్ దంపతులు.

కాగా.. సబర్మతీ నది ఒడ్డున ఉన్న ఆశ్రమంలోనే గాంధీ మహాత్ముడు తన భార్య కస్తూర్బాతోపాటు పన్నెండేళ్లు నివాసమున్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక ఘట్టాలైన ఉప్పు సత్యాగ్రహం, దండి యాత్ర ఇక్కడ నుండే ప్రారంభమయ్యాయి. అహింసా సిద్దాంతాన్ని, మనుషుల మధ్య అడ్డుగోడలు ఉండకూడదన్న సత్యాన్ని సబర్మతీ ఆశ్రమం నినదిస్తుంది.