Breaking News
  • కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు.
  • భక్తులు లేక భద్రాద్రి బోసిపోయింది.. సీతా రామ చంద్ర స్వామి వారి కల్యాణానికి కరోనా ఆటంకం ఏర్పడింది .. కరోనా వైరస్ విస్తరణకు సామాజిక దూరం పాటించడమే శరణ్యం కావడంతో ... నిరాడంబరంగా జగదబిరాముని కళ్యాణం జరిగితోంది.
  • జమ్మూకాశ్మీర్ లోని కొన్ని గ్రామాలు రెడ్ జోన్ గా ప్రకటన. రాజౌరి జిల్లాలోని మంజకోట్ తహసీల్‌కు చెందిన సరోలా, డెహ్రీధర, మంగల్ నార్, గంబిర్ ముగ్లాన్ & కోట్లి అనే 5 గ్రామాలు జమ్మూ లో రెడ్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు.
  • కోవిడ్‌పై పోరు కోసం కిషన్ రెడ్డి ఒక నెల జీతం విరాళం. పీఎం-కేర్స్ నిధికి జీతంతోపాటు ఎంపీ లాడ్స్ నుంచి రూ. 1 కోటి కెటాయింపు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 50 లక్షల కేటాయింపు. మరో రూ. 50 లక్షలు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు కేటాయిస్తూ లేఖలు.
  • మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర లో 335 కేసులు,13 మంది మృతి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ. మహారాష్ట్రలో పరిస్థితులు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఉద్దవ్ ఠాక్రేతో మాట్లాడిన మోడీ.

NPRకు నియోజకవర్గాల పెంపునకు లింకు.. BJP ఖతర్నాక్ వ్యూహం

నియోజకవర్గాల సంఖ్య పెంపు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో మూడు రాజకీయ పార్టీల మధ్య చిచ్చు రాజేస్తోంది. ఇక్కడి అధికార పార్టీలకు ప్రయోజనం కలిగిచేందుకు కేంద్రంలోని అధికార పార్టీ సిద్దంగా లేకపోవడం వల్లనే...
trs ycp fires on bjp, NPRకు నియోజకవర్గాల పెంపునకు లింకు.. BJP ఖతర్నాక్ వ్యూహం

TRS, YCP parties angry on BJP: నియోజకవర్గాల సంఖ్య పెంపు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో మూడు రాజకీయ పార్టీల మధ్య చిచ్చు రాజేస్తోంది. ఇక్కడి అధికార పార్టీలకు ప్రయోజనం కలిగిచేందుకు కేంద్రంలోని అధికార పార్టీ సిద్దంగా లేకపోవడం వల్లనే రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల విభజన జరగడం లేదని టీఆర్ఎస్, వైసీపీలు భావిస్తున్నాయి. అందుకే బీజేపీపై రెండు పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా కిషన్ రెడ్డి తాజా వ్యాఖ్యలు మూడు పార్టీల మధ్య దూరాన్ని మరింతగా పెంచాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో విభజన చట్టంలో నియోజకవర్గాల పెంపు అంశాన్ని చేర్చారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందే కొత్త నియోజకవర్గాలు వస్తాయని కోటి ఆశలతో టీఆర్‌ఎస్‌ నేతలు ఎదురుచూశారు. కానీ కేంద్రం ఈసారికి కుదరదంటూ దాటేసింది. కొన్ని సందర్భాలలో 2026 వరకు నియోజకవర్గాల పెంపు కుదరదని తేల్చి చెప్పేసింది. దానికితోడు 2021 జనాభా గణన తర్వాతనే వాటి ఆధారంగా 2026లో నియోజకవర్గాలను పెంచాలని గతంలో కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లపై రచ్చ నెలకొంది. టీఆర్ఎస్, వైసీపీలు వాటిని వ్యతిరేకిస్తున్నాయి. దాని వల్ల తెలుగు రాష్ట్రాల్లో జన గణన సజావుగా జరిగే అవకాశాల్లేవు. ఫలితంగా ఇప్పటికిప్పుడు కాదు.. కదా కనీసం 2026 నాటికి కూడా నియోజకవర్గాల పెంపు వుంటుందా అన్నది సందేహంగా మారుతోంది.

అప్పట్లో నియోజకవర్గాల పెంపు వల్ల తమ పార్టీకి ఒరిగేది ఏమీ ఉండదని బీజేపీ భావించింది. నియోజకవర్గాల సంఖ్య పెంచితే ఆంధ్రప్రదేశ్‌లో గతంలో టీడీపీ ఇపుడు వైసీపీ లాభపడతాయని బీజేపీ భావించింది. ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలపడుతుందని బీజేపీ అంచనా వేసింది. అందుకే అప్పుడు, ఇప్పుడు నియోజకవర్గాల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని తెలుస్తోంది.

కారు పార్టీ క్రౌడ్ ఫుల్‌గా మారింది. ఇప్పుడు నియోజకవర్గాల పెంపుపైనే కొందరు నేతలు ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గాలు పెరిగితే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి రెండు అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. తెలంగాణ వ్యాప్తంగా 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పడతాయి. మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య కూడా ఆ రేషియో ఆధారంగా పెరుగుతుంది. వీటితో పాటే ఎమ్మెల్సీల సంఖ్య కూడా పెరగనుంది. దీంతో టిఆర్ఎస్ పార్టీలో చేరిన కొత్త నేతలకు … మొదటి నుంచి ఉండి అవకాశాలు రాని పాత నేతలకు పదవుల పండగే… కానీ కేంద్రం నుంచి మాత్రం ఎలాంటి సానుకూల సంకేతాలు లభించడంలేదు.

ఆంధ్రప్రదేశ్‌‌లోనూ నియోజకవర్గాల పెంపు కోసం వైఎస్ఆర్‌సీపీ ఎదురుచూస్తోంది. ఇప్పటికే కౌన్సిల్ రద్దుతో కలవరం చెందుతున్న వైసీపీ నేతలు కొత్త నియోజకవర్గాలు పెంపుపైనే ఆశలు పెట్టుకున్నారు. రాజకీయాల్లో ఎన్ని పదవులు వచ్చినా ఎమ్మెల్యే అవ్వాలనేది ప్రతి రాజకీయ నాయకుడి కల. దీంతో నియోజకవర్గాలు పెంచితే తమ కలను నెరవేర్చుకునేందుకు వందల సంఖ్యలో రెండు తెలుగు రాష్ట్రాల నేతలు ఎదురు చూస్తున్నారు. అయితే వీరి ఆశలపై నీళ్లు చల్లారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. అసలు నియోజకవర్గాల పెంపు ఆలోచన లేదంటూ తాజాగా వ్యాఖ్యలు చేశారు.

కిషన్ రెడ్డి తాజాగా కేంద్ర వైఖరి ఏంటో తెలియజేయడంతో… అటు కేసీఆర్.. ఇటు జగన్.. ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం చేయబోతున్నారు అని ఆసక్తిగా మారింది. ఎన్ని సార్లు విన్నవించుకున్నా బీజేపీ పెద్దల అభిమతం మారడం లేదనడానికి కిషన్ రెడ్డి వ్యాఖ్యలే ఉదాహరణ అంటూ మండిపడుతున్నారు టీఆర్ఎస్, వైసీపీ నాయకులు. జనభా గణనకోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్, వైసీపీలకు నియోజకవర్గాల పెంపును డిమాండ్ చేసే అర్హత లేదన్నది కమలనాథుల వాదన.

Related Tags