కశ్మీర్ కల్లోలం.. ‘నిట్’ విద్యార్థులకు కేటీఆర్ అభయం

KTR on NIT Students, కశ్మీర్ కల్లోలం.. ‘నిట్’ విద్యార్థులకు కేటీఆర్ అభయం

జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా శ్రీనగర్ ఎన్‌ఐటీ క్యాంపస్‌ను విద్యార్థులు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఆందోళనకు గురౌవుతున్నారు. తమకు సహాయం చేయాలంటూ తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయనాయకులకు విఙ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఈ కష్టాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

‘‘శ్రీనగర్‌లోని ఎన్‌ఐటీలో చదువుతున్న విద్యార్థులను తక్షణమే ఖాళీ చేసి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో విద్యార్థులు ఆందోళనకు గురౌవుతున్నట్లు చాలా మెసేజ్‌లు వచ్చారు. టెన్షన్ పడకండి. మిమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. అక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. వారు మిమ్మల్ని రక్షిస్తారు. ఏ విద్యార్థికైనా, తల్లిదండ్రులకైనా సాయం కావాలనుకుంటే ఢిల్లీలో ఉన్న మన రెసిడెంట్ కమిషనర్ శ్రీ వేదాంతం గిరిని సంప్రదించండి అని’’ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఒక టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు ఆయన వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను కూడా జత చేశారు. కాగా జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 35Aను కేంద్రం రద్దు చేయబోతుందని.. అందుకే ముందస్తు చర్యల్లో భాగంగా వేలాది మంది సాయధ బలబాలను లోయలోకి పంపుతోందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో అక్కడి నేతలు, ప్రజల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *