గతంలో ఆయన్ను కలిశాను.. సిద్దార్థ జెంటిల్‌మెన్: కేటీఆర్ ట్వీట్

TRS Working President KTR Tweet on VG Siddharthas Death, గతంలో ఆయన్ను కలిశాను.. సిద్దార్థ జెంటిల్‌మెన్: కేటీఆర్ ట్వీట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాఫీ డే కింగ్ సిద్దార్థ మృతి పట్ల తెలంగాణ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. సిద్దార్థ ఆకస్మిక మరణం చాలా బాధాకరమన్నారు. ఆయన మరణవార్త విని ఆవేదనకు గురయ్యానని చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఆయనను కలిసే అవకాశం వచ్చిందని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆయన సౌమ్యుడు, జెంటిల్‌మెన్‌.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని.. కేఫ్ కాఫీ డే ధైర్యంగా ఉండాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *