గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ వ్యూహరచన

రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21 లోగా ఓటరు నమోదు కార్యక్రమం పూర్తి చెయ్యాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ వ్యూహరచన
Follow us

|

Updated on: Sep 14, 2020 | 8:49 PM

రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21 లోగా ఓటరు నమోదు కార్యక్రమం పూర్తి చెయ్యాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాస్ క్యాంపెన్ కాకుండా పక్కా ప్లాన్ గా ఎన్నికలు ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేశారు. మనకు అన్ని రకాలుగా యంత్రాంగం ఉందని… రెండు ఎమ్మెల్సీ స్థానాలు మనమే గెలవాలని పార్టీ శ్రేణులతో కేటీఆర్ చెప్పారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల పై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. దీంతోపాటు, కేంద్రంలో ప్రధాని మోదీ జమిలి ఎన్నికలకు ప్రయత్నాలు చేస్తున్నారని.. మనం అన్ని రకాలుగా సిద్ధం అవ్వాలంటూ కేటీఆర్ పార్టీ నాయకులతో అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను త్వరలోనే ఫైనల్ చేద్దామని నేతలకు చెప్పారు కేటీఆర్.