తెలంగాణ మత్స్యశాఖకు కేటీఆర్ అభినందనలు

TRS working president KTR praises Department of fisheries, తెలంగాణ మత్స్యశాఖకు కేటీఆర్ అభినందనలు

తెలంగాణ మత్స్యశాఖ అధికారులను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. చేపల ఉత్పత్తిలో 3 లక్షల టన్నుల మైలురాయి దాటడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన చేపపిల్లల పంపిణీ, మార్కెటింగ్ సదుపాయం వల్లే సాధ్యమైందని చెప్పారు. ఈ నేపథ్యంగా ట్విట్టర్ ద్వారా మత్స్యశాఖ అధికారులు, చేపల పెంపకందారులను కేటీఆర్ అభినందించారు. చేపల ఉత్పత్తి రంగానికి కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు వెన్నెముకగా నిలవనున్నాయని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *