Breaking News
  • అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు. నగరాల ప్రజలు బయటకు వెళ్లకుండా కట్టడి చేయాలి. వలస కూలీలకు వసతులు, సకాలంలో వేతనాలు చెల్లించేలా చూడాలి. విద్యార్థులు, కార్మికులను ఖాళీ చేయాలని కోరినవారిపై చర్యలు-కేంద్రం.
  • దేశవ్యాప్తంగా ఆల్కహాల్‌ విత్‌డ్రాల్‌ సిండ్రోమ్‌ . కేరళలో మద్యానికి బానిసై ఆరుగురు ఆత్మహత్య. ఆల్కహాల్‌ లేదన్న బాధతో షేవింగ్‌ లోషన్‌ తాగిన ఓ వ్యక్తి. తెలంగాణలో మద్యం దొరకడంలేదని ప్రాణం తీసుకున్న ఓ వ్యక్తి. తెలంగాణలో కల్లు దొరకక ఓ వ్యక్తి వింత ప్రవర్తన. ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకోవడంతో మృతి.v
  • తూ.గో: ఉ.6 నుంచి 10 వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి. జిల్లాలో ఐదు ఐసోలేషన్‌ పడకలు సిద్ధం-మంత్రి పిల్లి సుభాష్‌. 15 వేల మంది ఉండేలా క్వారంటైన్‌ కేంద్రాలు. అక్వా రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం-మంత్రి పిల్లి సుభాష్‌.
  • ప్రధాని మోదీకి రాహుల్‌ లేఖ. మన దేశం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ చర్యలకు సహకరించడానికి సిద్ధం-రాహుల్‌. లక్షల సంఖ్యలో రోజువారీ కూలీలు ఉన్నారు. లాక్‌డౌన్‌తో చాలామంది ప్రజలు చనిపోయే పరిస్థితి. లక్షలాది మంది యువత సొంత గ్రామాలకు వెళ్తున్నారు. వారిలో కరోనా ఉంటే తల్లిదండ్రులు, వృద్ధులకు సోకే అవకాశం. కొత్త ఆస్పత్రుల నిర్మాణం వెంటనే చేపట్టాలి-రాహుల్‌.
  • స్పైస్‌ జెట్‌ పైలట్‌కు కరోనా పాజిటివ్‌. మార్చి 21న చెన్నై నుంచి ఢిల్లీకి విమానాన్ని నడిపిన పైలట్‌. స్వీయ నిర్బంధంలోనే పైలట్‌.

కేంద్రంలో చక్రం తిప్పబోతున్నాం : కేటీఆర్

KTR Public meeting At Kukatpally, కేంద్రంలో చక్రం తిప్పబోతున్నాం : కేటీఆర్

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఆదరించిన మైనార్టీలకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. కూకట్‌పల్లి రాజీవ్‌గాంధీ నగర్‌ మైదానంలో మైనార్టీల భారీ బహిరంగసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ మాటలు తప్ప చేతలు ఉండవని అన్నారు. గత ఎన్నికల్లో చాయ్ వాలా గా ఉన్న మోదీ.. ఇప్పుడు చౌకీదార్‌గా మారారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలోనే మోదీకి ప్రజలు, దేవుడు గుర్తుకొస్తారని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీది ఇందిరా గాంధీ నుంచి ఇప్పటి రాహుల్ వరకు ఒకే నినాదమని అన్నారు. గరీభీ హఠావో అన్న నినాదం పట్టుకుని ఇంకా ఎన్నాళ్లు ఓట్లు అడుగుతారని మండిపడ్డారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించామని.. అదే 16 ఎంపీ సీట్లు వస్తే కేంద్రం మెడలు వంచి మన హక్కులను సాధించుకోవచ్చని అన్నారు.

Related Tags