బ్రేకింగ్ : టీఆర్ఎస్ ఖాతాలోకి నేరేడుచర్ల మునిసిపల్..

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మునిసిపల్ చైర్మన్ ఎన్నిక ట్విస్టులపై ట్విస్టులిస్తూ సాగింది. ఈ ఉత్కంఠ పోరులో.. చైర్మన్ పదవి చివరకు టీఆర్ఎస్‌కే దక్కింది. చివరి నిమిషంలో టీఆర్ఎస్ అభ్యర్థి శేరి సుభాష్ రెడ్డిని ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నమోదు చేయడంతో.. చైర్మన్ ఎంపిక రసవత్తరంగా మారింది. సుభాష్ రెడ్డి చేరికతో.. టీఆర్ఎస్ బలం 11కు చేరింది. సోమవారం రోజు కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇరు పార్టీల బలాలు సేమ్ ఉండటంతొ.. తొలుత డ్రా తీస్తారని అంతా భావించారు. కానీ […]

బ్రేకింగ్ : టీఆర్ఎస్ ఖాతాలోకి నేరేడుచర్ల మునిసిపల్..
Follow us

| Edited By:

Updated on: Jan 28, 2020 | 12:53 PM

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మునిసిపల్ చైర్మన్ ఎన్నిక ట్విస్టులపై ట్విస్టులిస్తూ సాగింది. ఈ ఉత్కంఠ పోరులో.. చైర్మన్ పదవి చివరకు టీఆర్ఎస్‌కే దక్కింది. చివరి నిమిషంలో టీఆర్ఎస్ అభ్యర్థి శేరి సుభాష్ రెడ్డిని ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నమోదు చేయడంతో.. చైర్మన్ ఎంపిక రసవత్తరంగా మారింది. సుభాష్ రెడ్డి చేరికతో.. టీఆర్ఎస్ బలం 11కు చేరింది. సోమవారం రోజు కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇరు పార్టీల బలాలు సేమ్ ఉండటంతొ.. తొలుత డ్రా తీస్తారని అంతా భావించారు. కానీ మంగళవారం ఆసక్తికర పరిణామాల చోటుచేసుకున్నాయి. సోమవారం ఇచ్చిన జాబితా ప్రకారమే ఎన్నిక జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిని కూడా లిస్టులో చేర్చడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసింది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిక జరగాలంటూ.. మరికొందరు కాంగ్రెస్ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. సోమవారం రోజు ఎన్నిక ప్రక్రియలో భాగంగా టీఆర్ఎస్ గొడవ చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ గెలిచిన సీట్లన్నీ అక్రమంగా గెలిచారంటూ ఆరోపించారు. సోమవారం లిస్టులో లేని శేరి సుభాష్ రెడ్డి ఓటును.. ఎలా ఆడ్ చేస్తారని టీ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కాగా, టీఆర్ఎస్ తీరును నిరసిస్తూ.. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. దీంతో ఇక నేరేడుచర్ల మునిసిపల్ చైర్మన్ టీఆర్ఎస్ ఖాతాలో పడిపోయినట్లైంది.