జడ్పీల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం..32 స్థానాలు క్లీన్ స్వీప్

కారు మళ్లీ జోరు చూపించింది. జడ్పీ పీఠాలపై గులాబీ జెండా ఎగిరింది. తెలంగాణలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌‌ల ఎన్నిక పూర్తయింది. శుక్రవారం ఎంపీపీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన టీఆర్ఎస్ అభ్యర్థులు జడ్పీ ఛైర్మన్ల ఎన్నికల్లోనూ సత్తాచాటారు. మొత్తం 32 స్థానాలు క్లీన్‌స్వీప్ చేసింది టీఆర్ఎస్.  చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్ పదవులనూ టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. దాంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అన్ని జిల్లాల్లో విజయ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాయి. కాగా, 32 మంది జడ్పీ ఛైర్మన్‌లలో 20 మంది మహిళలే ఉండడం విశేషం.

జిల్లా పరిషత్‌ ఛైర్మన్లుగా ఎన్నికైంది వీళ్లే..
ఆదిలాబాద్‌ – రాథోడ్‌ జనార్దన్‌
నారాయణపేట – వనజమ్మ
కరీంనగర్‌ – కనుమల్ల విజయ
కామారెడ్డి – దఫేదార్‌ శోభ
నిజామాబాద్‌ – విఠల్‌ రావు
జయశంకర్‌ భూపాలపల్లి – జక్కు శ్రీహర్షిణి
మహబూబాబాద్‌ – ఆంగోతు బిందు
ములుగు – కుసుమ జగదీశ్‌
నిర్మల్‌ – విజయలక్ష్మీ
కుమ్రంభీం -ఆసీఫాబాద్‌ – కోవ లక్ష్మీ
మంచిర్యాల – నల్లాల భాగ్యలక్ష్మీ
వనపర్తి – లోక్‌నాథ్‌ రెడ్డి
నాగర్‌కర్నూలు – పద్మావతి
జోగులాంబ గద్వాల – సరిత
భద్రాద్రి కొత్తగూడెం – కోరం కనకయ్య
మేడ్చల్‌ -మల్కాజ్‌గిరి – శరత్‌ చంద్రారెడ్డి
మహబూబ్‌నగర్‌ – స్వర్ణ సుధాకర్‌
యాదాద్రి భువనగిరి – సందీప్‌ రెడ్డి
సూర్యాపేట – గుజ్జ దీపిక
ఖమ్మం- లింగాల కమల్‌రాజ్‌
వికారాబాద్‌ – సునీతా మహేందర్‌ రెడ్డి
రంగారెడ్డి – తీగల అనితారెడ్డి
నల్గొండ – బండా నరేందర్‌రెడ్డి
సిద్దిపేట – రోజా శర్మ
సంగారెడ్డి – మంజుశ్రీ
మెదక్‌ – హేమలత
వరంగల్‌ అర్బన్‌ – మారేపల్లి సుధీర్‌
వరంగల్‌ రూరల్‌ – గండ్ర జ్యోతి
జనగామ – సంపత్‌ రెడ్డి
జగిత్యాల – దావ వసంత
పెద్దపల్లి – పుట్ట మధు
రాజన్న సిరిసిల్ల – అరుణ

ఇది ప్రజావిజయం: కేసీఆర్‌

జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ అధ్యక్షులుగా ఎన్నికైన వారికి సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు చెప్పారు. నూతనంగా కొలువుదీరిన పాలకమండళ్లకు అభినందనలు తెలిపారు. స్థానిక సంస్థల్లో అనితర సాధ్యమైన విజయాలు సాధించామన్నారు. టీఆర్‌ఎస్ అఖండ విజయానికి కృషిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. ఇంత పెద్ద విజయాన్ని తమకు అందించిన ప్రజలకు, ఓటర్లకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. స్థానిక సంస్థల్లో దక్కిన గెలుపు ప్రజావిజయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివర్ణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *