ఆదిలాబాద్ మున్సిపల్ కోఆప్షన్‌ను దక్కించకున్న టీఆర్ఎస్

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. నాలుగు కో ఆప్షన్‌ పదవుల్లో మూడింటిని టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. మూడు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను నిలిపింది. దీంతో  ఎన్నికలు అనివార్యంగా మారింది. జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ప్రత్యేక పాలకవర్గ సమావేశం గురువారం ఏర్పాటు చేశారు. ఎక్స్‌ అఫీషియోగా ఉన్న ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ సమక్షంలో మున్సిపల్‌  ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. స్పెషల్‌ నాలెడ్జ్‌ కింద నిర్వహించిన ఎన్నికల్లో […]

ఆదిలాబాద్ మున్సిపల్ కోఆప్షన్‌ను దక్కించకున్న టీఆర్ఎస్
Follow us

|

Updated on: Jul 31, 2020 | 12:00 AM

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. నాలుగు కో ఆప్షన్‌ పదవుల్లో మూడింటిని టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. మూడు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను నిలిపింది. దీంతో  ఎన్నికలు అనివార్యంగా మారింది. జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ప్రత్యేక పాలకవర్గ సమావేశం గురువారం ఏర్పాటు చేశారు. ఎక్స్‌ అఫీషియోగా ఉన్న ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ సమక్షంలో మున్సిపల్‌  ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు.

స్పెషల్‌ నాలెడ్జ్‌ కింద నిర్వహించిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సత్యనారాయణకు 36ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి జ్యోతికి 11 ఓట్లు వచ్చా యి. అలాగే స్పెషల్‌ నాలెడ్జ్‌ మహిళా కోటాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇజ్జగిరి మమతకు 36ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి జ్యోతికి 11 ఓట్లు వచ్చాయి. అలాగే మైనార్టీ కోటాలో మహిళల విభాగంలో ఎంఐఎం అభ్యర్థి షమీన్‌ సుల్తానా, జనరల్‌ విభాగంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎజాజ్‌ విజయం సాధించారు.