కొత్త రాజకీయపార్టీపై స్పందించిన కేసీఆర్

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు దేశాన్ని సర్వనాశనం చేశాయని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

కొత్త రాజకీయపార్టీపై స్పందించిన కేసీఆర్
Follow us

|

Updated on: Sep 07, 2020 | 9:02 PM

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు దేశాన్ని సర్వనాశనం చేశాయని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటుపై భవిష్యత్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. జాతీయ స్థాయిలో కేసీఆర్ కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారని.. ఆపేరు కూడా ఇదేనంటూ ఇటీవల వస్తున్న వార్తలని కేసీఆర్ ఖండించారు. సోషల్ ‌మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని కొట్టిపారేశారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్సీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీ ముగిసిన అనంతరం మాట్లాడిన సందర్భంలో కేసీఆర్ ఈ స్పష్టతనిచ్చారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి సీఎం నివాళి అర్పించారు. ఆయన మృతితో దుబ్బాకలో ఉప ఎన్నికల అనివార్యమైన విషయం తెలిసిందే. సోలిపేట కుటుంబంలోనే ఒకరికి టీఆర్ఎస్ టికెట్‌ దక్కే అవకాశం కనిపిస్తోంది.