ఏపీలోని ప్రతిపక్షాలకు కొండంత బలాన్నిచ్చేలా టీఆర్ఎస్ నిర్ణయం.!

రైతులకు కరెంట్- నగదు బదిలీ అంశం ఏపీలో తాజాగా రాజకీయ ప్రకంపనలకు వేదికైతే, ఈ విషయంలో టీఆర్ఎస్ సర్కారు స్టాండ్ ఆంధ్రప్రదేశ్ లోని విపక్షాలకు కొత్త అస్త్రం కాబోయేలా కనిపిస్తోంది. ప్రజా వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత విద్యుత్‌ సవరణ బిల్లు..

ఏపీలోని ప్రతిపక్షాలకు కొండంత బలాన్నిచ్చేలా టీఆర్ఎస్ నిర్ణయం.!
Follow us

|

Updated on: Sep 10, 2020 | 8:49 PM

రైతులకు కరెంట్- నగదు బదిలీ అంశం ఏపీలో తాజాగా రాజకీయ ప్రకంపనలకు వేదికైతే, ఈ విషయంలో టీఆర్ఎస్ సర్కారు స్టాండ్ ఆంధ్రప్రదేశ్ లోని విపక్షాలకు కొత్త అస్త్రం కాబోయేలా కనిపిస్తోంది. ప్రజా వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత విద్యుత్‌ సవరణ బిల్లు ఉందని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు కే. కేశవరావు చేసిన వ్యాఖ్యలే దీనికి కారణయ్యే అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లను స్థానిక నేతలు అంగీకరిస్తారా? అని కేకే ప్రశ్నించారు. తమతో కలిసి వచ్చేవారితో కలిసి విద్యుత్‌ బిల్లును వ్యతిరేకిస్తామని కేకే చెప్పారు. సమస్యలపై రాజీ పడేది లేదన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రజలు ఇబ్బంది పడాలా అని అన్నారు. ప్రగతిభవన్‌లో పార్టీ ఎంపీలతో సీఎం కేసీఆర్‌ జరిపిన సమావేశం ముగిసింది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కేకే మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి అవసరమున్న యూరియా కేంద్రం ఇవ్వలేదని కేకే ఆరోపించారు. జాతీయ రహదారుల విషయంలో ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోవాలన్నారు. నవోదయ స్కూళ్ల గురించి ఏడేళ్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఫలితం శూన్యం అన్నారు. జీఎస్టీ బకాయిలు ఇవ్వకపోతే ఎలా ఊరుకుంటామన్నా కేకే.. మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. వీటన్నిటిపైనా టీఆర్ఎస్ సమస్యలపై ఈ సమావేశాల్లో కేంద్రంపై పోరాడుతామని చెప్పారు. ఇలాఉంటే, ఏపీ సర్కారు రైతులకు ఉచిత విద్యుత్ అంశంపై కేంద్రం తెచ్చిన కొత్త మార్గదర్శకాల్ని పాటిస్తూ ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, జనసేన, బీజేపీ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం