టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని టీఆర్ఎస్ ప్రకటించింది. పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో సీఎంను కలిసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి.. తనను అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గుత్తా నామినేషన్ పత్రాల దాఖలు ప్రక్రియలో సహకరించాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డికి సీఎం ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *