తోగుటకు త్వరలో మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప్రాజెక్టు జలాలుః హరీష్ రావు

రాబోయే రోజుల్లో తోగుట మండ‌లానికి మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప్రాజెక్టు నీటిని తీసుకువ‌స్తామ‌ని రాష్ట్రమంత్రి హరీష్ రావు తెలిపారు.

తోగుటకు త్వరలో మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప్రాజెక్టు జలాలుః హరీష్ రావు
Follow us

|

Updated on: Oct 22, 2020 | 3:44 PM

రాబోయే రోజుల్లో తోగుట మండ‌లానికి మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప్రాజెక్టు నీటిని తీసుకువ‌స్తామ‌ని రాష్ట్రమంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్ధిపేట్ పూర్తిగా సస్యశ్యామలవుతుందన్నారు. తోగుట మండ‌లంలోని ప‌లు గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరంద‌రికి మంత్రి హ‌రీష్ రావు కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీకి అపూర్వ స్పంద‌న ల‌భిస్తుంద‌ని ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు అన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసిన ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్న మంత్రి హరీష్.. కాంగ్రెస్, బీజేపీ నాయ‌కులు అస‌త్యాలు ప్ర‌చారం మానుకోవాలన్నారు. 60 ఏళ్ల‌లో జ‌ర‌గ‌ని అభివృద్ధిని ఐదేళ్ల‌లోనే చేసి చూపించామ‌ని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయ‌కుల మోస‌పూరిత మాట‌లు న‌మ్మొద్దు అన్నారు హరీష్. ఎన్నిక‌లు వ‌స్తేనే గ్రామాల్లోకి కాంగ్రెస్, బీజేపీ నాయ‌కులు వ‌స్తారు. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు మాత్రం నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్యే తిరుగుతూ వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కార‌స్తార‌ని తెలిపారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పట్ల ప్ర‌జ‌ల‌కు పూర్తి స్థాయిలో న‌మ్మ‌కం ఉందన్న హరీష్ రావు దుబ్బాక ఎన్నికల్లోనూ గులాబీ జెండా విజయం ఖాయమైందన్నారు.