సస్పెండ్ అయిన సభ్యులకు టీఆర్ఎస్ ఎంపీల సంఘీభావం

రాజ్యసభలో సస్పెండ్ అయిన 8 మంది ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో చేస్తున్న నిరసనకు టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. మోదీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. రైతుల గురించి.. రైతుల హక్కుల గురించి పోరాడుతూ రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు వ్యతిరేకించామని కేకే ఈ సందర్భంలో వివరణ ఇచ్చారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించిన ఎంపీలను సస్పెండ్ చేశారని.. ఇది […]

సస్పెండ్ అయిన సభ్యులకు టీఆర్ఎస్ ఎంపీల సంఘీభావం
Follow us

|

Updated on: Sep 21, 2020 | 2:39 PM

రాజ్యసభలో సస్పెండ్ అయిన 8 మంది ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో చేస్తున్న నిరసనకు టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. మోదీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. రైతుల గురించి.. రైతుల హక్కుల గురించి పోరాడుతూ రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు వ్యతిరేకించామని కేకే ఈ సందర్భంలో వివరణ ఇచ్చారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించిన ఎంపీలను సస్పెండ్ చేశారని.. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని ఆయన అన్నారు. రూల్ 256 కింద సస్పెండ్ చేసామంటున్నారు…మరి రూల్ 252 కింద బిల్లుల ఆమోదానికి ఓటింగ్ అవసమన్న నిబంధన ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ నిబంధనలు పాటించలేదన్న కేకే.. వ్యవసాయ బిల్లుల ఓటింగ్ కోసం డివిజన్ అడిగినా డిప్యూటీ చైర్మన్ అనుమతి ఇవ్వలేదని చెప్పారు. అన్యాయంగా అప్రజాస్వామికంగా ఎంపీలను సస్పెండ్ చేశారు..వారికి మా సంఘీభావం తెలువుతున్నాం అని కేశవరావు స్పష్టం చేశారు.