గ్రేటర్ లో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. గాంధీనగర్‌ ఇంటింటి ప్రచారం చేపట్టిన ఎమ్మెల్సీ కవిత

గ్రేటర్‌ కార్పొరేషన్‌కు జరుగుతున్నఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల గెలుపుకోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 12:12 pm, Thu, 26 November 20

గ్రేటర్‌ కార్పొరేషన్‌కు జరుగుతున్నఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల గెలుపుకోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆరేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని కవిత అన్నారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామన్నారు. గాంధీనగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముఠా పద్మానరేశ్‌కి మద్దతుగా కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గాంధీనగర్‌ డివిజన్‌లో అనేక అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. బీజేపీ అబద్దాలు చెప్పి గెలిచే కాలం చెల్లిందన్న ఆమె టీఆర్ఎస్ కే మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. వరదలతో నష్టపోయిన వారిని సీఎం కేసీఆర్‌ ఆదుకుంటుంటే.. బీజేపీ అబద్ద ప్రచారంతో అడ్డుకుంటున్నారన్నారు. గాంధీనగర్ ప్రచారంలో భాగంగా పాన్ షాప్ యాజమానితో ముచ్చటించిన కవిత.. కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు సకాలానికి అందుతున్నాయా లేదని ఆరా తీశారు. నగరంలోని ప్రతి ఏరియాలో బస్తీ దవఖానా, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు కవిత.