Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం 18 లక్షల 55 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 1855746 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 586298 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 1230510 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 38938 దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 52050 కరోనా కేస్ లు, 803 మంది మృతి
  • తెలంగాణ బీజేపీ కార్యాలయానికి కరోనా ఎఫెక్ట్. కార్యాలయాన్ని సోమవారం వరకు మూసి ఉంచాలని నిర్ణయించిన రాష్ట్ర నాయకత్వం. జాతీయ పార్టీ కీలక నేతలు కరోనా బారిన పడటంతో రాష్ట్ర కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించ కూడదని నిర్ణయం.
  • అమరావతి : ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం. 3రాజధాని అంశంపై హైకోర్టు విచారణ. రాజధాని తరలింపుపై స్టే ఇచ్చిన హైకోర్టు. గవర్నర్ గెజిట్ పై స్టే ఇచ్చిన ఏపీ హైకోర్ట్.
  • రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాలపై స్టేటస్‌ కో విధించిన హైకోర్టు. యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించిన హైకోర్టు. 10 రోజులపాటు స్టేటస్‌ కో ఉత్తర్వులు కొనసాగుతున్న హైకోర్టు. రెండు బిల్లులకు సంబంధించి ఇదివరకే గెజిట్‌ విడుదల. తదుపరి కార్యకలాపాలపై స్టేటస్‌ కో విధించిన హైకోర్టు.
  • అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. కొరియాకు చెందిన సీఈఓ, డైరెక్టర్ సహా మొత్తం 12 మందికి కండిషన్ బెయిల్ ఇస్తూ ఆదేశాలు. స్టెరైన్ గ్యాస్ నిల్వ లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నమోదైన కేసులో వీరిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు.
  • ఇవాళ యూపీఎస్సీ సివిల్స్-2019 ఫలితాలు వెలువడ్డాయి. సిద్ధిపేటకు చెందిన మంద మకరంద్ ఆలిండియా స్థాయిలో 110వ ర్యాంక్ సాధించాడు. మొత్తం 829 మంది సివిల్ సర్వీసులకు ఎంపికవగా, మకరంద్ మెరుగైన ర్యాంక్ అందుకున్నాడు. దీనిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన సిద్ధిపేట బిడ్డ మంద మకరంద్ కు హార్దిక శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ ఖ్యాతిని దేశ స్థాయిలో నిలిపాడంటూ మకరంద్ ను అభినందించారు.
  • మరో మూడు కార్పొరేట్‌ ఆస్పత్రులకు కోవిడ్ సేవలు కట్...! హైదరాబాద్ లో కరోనా ట్రీట్ మెంట్ చేస్తున్న మరికొన్ని ఆస్పత్రులకు ఆరోగ్య నోటీసులు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై ప్రభుత్వం యాక్షన్ .

సింగరేణి ఎమ్మెల్యేల చింత.. తీర్చేనా కెసీఆర్?

singareni area mlas tension, సింగరేణి ఎమ్మెల్యేల చింత.. తీర్చేనా కెసీఆర్?

ఆర్టీసీ సమ్మె సింగరేణికి తలనొప్పిగా మారిందా? ఆర్టీసీ కార్మిక సంఘాల వల్లే సంస్థకు, కార్మికులకు అన్యాయం జరిగిందని కేసీఆర్‌ చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఇదే వాదనను సింగరేణి కార్మిక సంఘాలకు వర్తింప చేస్తే తమ పరిస్థితి ఏంటని సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట. త్వరలోనే సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎటువైపు నిలబడాలో తేల్చుకోలేక నలిగిపోతున్నారట సింగరేణి ఏరియాతో టచ్ వున్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు.

ఆర్టీసీ కార్మికల సమ్మె మొదలైన నాటి నుంచి కార్మిక సంఘాలపై కేసీఆర్‌ సీరియస్‌గా ఉన్నారు. సంఘాలే కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని పలుమార్లు ప్రకటించిన సిఎం చివరకు ఆర్టీసీ కార్మిక సంఘాలకు చెక్‌ పెట్టారు. దాంతో మిగతా కార్మిక సంఘాల్లో టెన్షన్‌ మొదలైంది. అయితే కార్మిక సంఘాలు లేకుండా చేయడం సాధ్యం కాదని, సిఎం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కార్మిక నేతలు గట్టిగానే మాట్లాడుతున్నారు. వీరికి మద్దతుగా మాజీ హోం మంత్రి , టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నర్సింహారెడ్డి కూడా సంఘాలకు మద్దతుగా ప్రకటనలు చేయడంతో ఇప్పుడు సింగరేణి పరిధిలో ఉన్న గులాబీ ప్రజాప్రతినిధులకు గుబులు పట్టుకుంది.

కొద్ది రోజుల్లో సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలున్నాయి.. దీంతో ఆ ప్రాంత ఎమ్మెల్యేలకు టెన్షన్‌ పట్టుకుంది. ఒకవైపు కార్మిక సంఘాల పేరు వింటేనే సిఎం ఒంటికాలిపై లేస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌ నిర్ణయంపై కార్మికసంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో తాము ఎవరివైపు నిలబడాలో తెలీక సతమతమవుతున్నారు.

ఇప్పుడు కార్మికులను కాదని సిఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటే భవిష్యత్తులో తమ పరిస్థితి ఏంటనే బెంగపట్టుకుందట ఆ ఎమ్మెల్యేలకి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్‌లోని రామగుండం, ఆదిలాబాద్‌లోని బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, వరంగల్‌లో భూపాలపల్లి, ఖమ్మంలోని కొత్తగూడెం , పాల్వంచ, ఇల్లందులతో పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు.. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇప్పుడు ఈ అంశం తలనొప్పిగా మారింది.

రెండేళ్ల పాటు ఆర్టీసీ గుర్తింపు సంఘాల మనుగడకు బ్రేకులు వేసిన సిఎం, ఇప్పుడు మిగతా సంఘాల విషయం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం తమకు తిప్పలు తప్పవని పెద్దల దగ్గర మొరపెట్టుకుంటున్నారట కొందరు ఎమ్మెల్యేలు. ఆర్టీసీ సంఘాల విషయంలో కఠినంగా వ్యవహరించిన గులాబీ బాస్‌, ఇప్పుడు సింగరేణి విషయంలో ఏం చేస్తారో తెలియక సదరు నాయకులు బిక్కుబిక్కుమంటున్నారు.

Related Tags