గులాబీ నేతల్లో గుబులు: కేసీఆర్‌కు ఎదురుపడేందుకు జంకు

గులాబీ పార్టీలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు విపరీతమైన టెన్షన్‌లో వున్నారట. పరీక్షలు రాసేశాం.. ఫలితాలు వచ్చేశాయి.. కానీ బాస్ నుంచి ఇంకా పిలుపు మాత్రం రావడం లేదు. ఇంతకీ తమకు మంచి మార్కులు పడ్డట్టా లేక అత్తెసరు మార్కులతో గట్టెక్కిన అంశాన్ని గులాబీ బాస్ సీరియస్‌గా పరిశీలిస్తున్నారా? ఇదే ఇపుడు ముగ్గురు మంత్రులకు, మరికొందరు ఎమ్మెల్యేలకు పట్టుకున్న టెన్షన్ అని తెలంగాణ భవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పెద్ద సారు ఎప్పుడు పిలిచి మాట్లాడుతారో.. ఏం చెప్పాలో అని […]

గులాబీ నేతల్లో గుబులు: కేసీఆర్‌కు ఎదురుపడేందుకు జంకు
Follow us

|

Updated on: Feb 05, 2020 | 6:23 PM

గులాబీ పార్టీలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు విపరీతమైన టెన్షన్‌లో వున్నారట. పరీక్షలు రాసేశాం.. ఫలితాలు వచ్చేశాయి.. కానీ బాస్ నుంచి ఇంకా పిలుపు మాత్రం రావడం లేదు. ఇంతకీ తమకు మంచి మార్కులు పడ్డట్టా లేక అత్తెసరు మార్కులతో గట్టెక్కిన అంశాన్ని గులాబీ బాస్ సీరియస్‌గా పరిశీలిస్తున్నారా? ఇదే ఇపుడు ముగ్గురు మంత్రులకు, మరికొందరు ఎమ్మెల్యేలకు పట్టుకున్న టెన్షన్ అని తెలంగాణ భవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

పెద్ద సారు ఎప్పుడు పిలిచి మాట్లాడుతారో.. ఏం చెప్పాలో అని తెగ టెన్షన్‌ పెడుతున్నారు ముగ్గురు మంత్రులు, మరికొందరు నేతలు. సార్‌ ప్రీ హ్యాండ్‌ ఇచ్చారు. కానీ తామే నిరూపించుకోలేదు. దీంతో ఇప్పుడు తమకు ఎలాంటి పనిష్‌మెంటు ఉంటుందో అని వీరు తెగ ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. మునిసిపల్‌ ఫలితాలు వచ్చాయి. 100కి పైగా మునిసిపాల్టీల్లో గులాబీ జెండా ఎగురవేసింది. అయితే కొన్ని చోట్ల మాత్రం అనుకున్న ఫలితాలు రాలేదు. దీంతో ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇప్పుడు టెన్షన్‌ పట్టుకుందని తెలుస్తోంది.

ఎన్నికల నోటిఫికేషన్‌ రాగానే ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. మునిసిపల్ ఎన్నికల ఫలితాల ఆధారంగానే మీ భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని సీఎం హెచ్చరిక కూడా చేశారు. ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపులో ఎమ్మెల్యేల మీద ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా సర్వ అధికారాలు ఇచ్చి వారిపై విశ్వాసం పెట్టారు.

మొత్తం 120 మునిసిపాలిటీల్లో 29 చోట్ల ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇప్పుడు తెలంగాణ భవన్‌కు రావాలంటే జంకుతున్నారట. మునిసిపల్ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికతో పాటు పూర్తి అధికారాలు, ఎన్నికల్లో గెలుపు బాధ్యతలు కూడా ఎమ్మెల్యేలకు ఇచ్చారు. కానీ గులాబీ బాస్ పెట్టిన నమ్మకాన్ని ఈ 29 మంది ఎమ్మెల్యేలు నిలుపుకోలేకపోయారు. దీంతో ఇప్పుడు వారంతా ఆందోళనలో ఉన్నారు.

మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గంలో రెండు కార్పొరేషన్‌లు ఉన్నాయి. వీటిలో టీఆర్‌ఎస్‌ సింగిల్‌గా గెలవలేదు. ఎక్స్‌ఆఫిషియో ఓట్లతోనే టీఆర్‌ఎస్‌ గెలిచింది. మంత్రి మల్లారెడ్డి ఇలాకాలో కూడా బోడుప్పల్‌ మునిసిపల్ కార్పొరేషన్‌ ఎక్స్‌‌ఆఫిషియో ఓట్లతోనే గట్టెక్కారు. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సొంత నియోజకవర్గం సూర్యాపేటలో కూడా సేమ్‌ సీన్‌ రిపీట్‌. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రేఖానాయక్‌, జైపాల్‌ యాదవ్‌, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, గొంగిడి సునీతా, సైదిరెడ్డి, ఫైళ్ల శేఖర్‌రెడ్డి, గణేష్‌ బిగాల, అబ్రహం, హర్షవర్ధన్‌రెడ్డి, కోరుకంటి చందర్‌తో పాటు మొత్తం 29 మంది ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో వన్‌ సైడ్‌ విజయాలు నమోదు కాలేదు. దీంతో ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు.

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నాటికి సీఎం కేసీఆర్‌కు వీరు ఎదురుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తమ నియోజకవర్గాల్లో ఓటమికి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీకి నివేదికలు పంపినట్లు సమాచారం. గ్రూపు తగాదాలు, కొంత మంది నేతలు సహకరించకపోవడం వల్లే పార్టీ అభ్యర్థులు గెలవలేకపోయారని వీరు రిపోర్టు ఇచ్చినట్లు తెలిసింది.