రేవంత్ రెడ్డి భూ వివాదంపై టీఆర్ఎస్ నేతలు ఏమన్నారంటే!

కబ్జాకు కాదేది అనర్హం అంటారు... అది పెద్దల భూమా... పేదల భూమా అన్నది కబ్జాకోరులకు సంబంధం లేదు. కన్నుపడిందంటే చాలు ఖతమే.... ఆ భూముల్లో రాబంధుల్లా రాలుతారు. గోపన్‌పల్లి, గంధంగూడలో సరిగ్గా ఇదే జరిగింది. దళితులను భయపెట్టి..

రేవంత్ రెడ్డి భూ వివాదంపై టీఆర్ఎస్ నేతలు ఏమన్నారంటే!
Follow us

| Edited By:

Updated on: Mar 14, 2020 | 10:41 AM

కబ్జాకు కాదేది అనర్హం అంటారు… అది పెద్దల భూమా… పేదల భూమా అన్నది కబ్జాకోరులకు సంబంధం లేదు. కన్నుపడిందంటే చాలు ఖతమే…. ఆ భూముల్లో రాబంధుల్లా రాలుతారు. గోపన్‌పల్లి, గంధంగూడలో సరిగ్గా ఇదే జరిగింది. దళితులను భయపెట్టి ఏంతో కొంత ముట్టజెప్పి లాగేసుకున్నారు ఓ ఎంపీ. అయితే ఇలాంటి వ్యవహారాలను ఉపేక్షించే ప్రసక్తేలేదంటోంది తెలంగాణ సర్కారు. కబ్జాకోరుల భరతం పడతామని హెచ్చరిస్తోంది.

రంగారెడ్డి జిల్లా గంధంగూడ భూ కబ్జా వ్యవహారం తెలంగాణ శాసనమండలిలో ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశాన్ని లేవనెత్తారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ప్రభాకర్‌. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ ఎంపీ.. దళితుల భూమిని కబ్జా చేశారని.. అది వారికే ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దాంతో పాటు పాటు దళితుల భూమిని కబ్జా చేసినవారిపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. కబ్జాచేసిన భూమిని ఎప్పటిలోగా అప్పగిస్తారో చెప్పాలన్నారు ఎమ్మెల్సీ ప్రభాకర్‌.

ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించింది. గంధంగూడలో 3.22 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని… త్వరలో ఈ భూకబ్జా విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అటు గోపన్‌పల్లి భూదందాపై కూడా త్వరలోనే స్పందిస్తామన్నారు. కబ్జా చేసిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి.

పేదలకు అండగా ఉండాల్సిన ఓ ప్రజాప్రతినిధి కబ్జాకోరుగా మారిపోవడం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై బురద జల్లడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇకనైనా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని రాజకీయ పరిశీలకులు హితవు పలుకుతున్నారు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన