Breaking News
  • అమరావతి : మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘన పై జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. భారీగా వాహన జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. బైక్ నుండి 7 సిటర్ కార్ల వరకు ఒక విధమైన జరిమానా . ఇతర వాహనాలకు మరింత అధిక జరిమానాలు.
  • విజయవాడ: ఇంద్రకీలాద్రి కి చేరుకున్న సీఎం జగన్. ఘాట్ రోడ్ మార్గంలో వచ్చిన సీఎం . సీఎం జగన్ కు స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ,జిల్లా ప్రజా ప్రతినిధులు ,కలెక్టర్ ,సిపి [ సాంప్రదాయ వస్త్ర ధారణ పంచెకట్టు లో సీఎం జగన్. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్.
  • భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. నగరంలోని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు పడ్డాయి. మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశముంది. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్‌.
  • హైదరాబాద్‌: వీడిన కూకట్‌పల్లి కిడ్నాప్‌ మిస్టరీ. 24 గంటల్లో కిడ్నాప్‌ కేసు ఛేదించిన పోలీసులు. రహీంను ఆటోలో కిడ్నాప్‌ చేసిన ఇద్దరు దుండగులు. రహీంను పఠాన్‌చెరు తీసుకెళ్లిన కిడ్నాపర్లు. తల్లి రేష్మకు ఫోన్‌ చేసి రూ.మూడు లక్షలు డిమాండ్‌. భయంతో రూ.10 వేలు ట్రాన్సఫర్‌ చేసిన తల్లి. మొబైల్‌ లొకేషన్‌ ఆధారంగా కిడ్నాపర్ల గుర్తింపు. ప్రధాన నిందితుడు సలీంను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పరారీలో మరో నిందితుడు లక్కీ. లక్కీ కోసం గాలిస్తున్న పోలీసులు.
  • విజయవాడ: ఇంద్రకీలాద్రికి పొంచి ఉన్న ముప్పు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని సమాచారం. భారీ వర్షాలకు 4 అంగుళాలు బీటలు వారిన కొండ. అప్రమత్తమైన ఇంజినీరింగ్‌ అధికారులు. ఈవో సురేష్‌బాబుకు సమాచారమిచ్చిన అధికారులు.
  • చిత్తూరు: చిత్తూరులో భారీ ఎత్తునపట్టుబడిన ఎర్రచందనం. ఐదు కార్లలో రెండు కోట్ల విలువైన రెండున్నర టన్నుల ఎర్రచందనం పట్టి వేత. వాహన తనిఖీల్లో పట్టుబడిన ఎర్రచందనం. 11మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరో పదిమంది స్మగ్లర్ల పరారీ.. కార్లు, ఆటోలు, పాల వానలు లో ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్లు. ఈ మధ్యకాలంలో ఇంత భారీ ఎత్తున ఎర్రచందనం పట్టుబడటం ఇదే మొదటిసారి.

లక్ష ఓట్ల మెజార్టీ గ్యారెంటీ : హరీశ్ రావు

దుబ్బాక ఉపఎన్నికలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని టీఆర్ఎస్ కీలకనేత, మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు కనీసం డిపాజిట్లయినా వస్తాయా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

TRS leader harish rao confidence on dubbaka by poll win, లక్ష ఓట్ల మెజార్టీ గ్యారెంటీ : హరీశ్ రావు

దుబ్బాక ఉపఎన్నికలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని టీఆర్ఎస్ కీలకనేత, మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు కనీసం డిపాజిట్లయినా వస్తాయా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆయా పార్టీలకు ఎంత విషయం ఉన్నదన్నది ఈ ఎన్నికతో తెలుస్తుందని అన్నారు. ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ కనీసం తెలంగాణ ప్రజలకు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయిందని హరీశ్ విమర్శించారు. ఆరేళ్ల తమ పాలనలో తాగునీరు, సాగునీరు అందించామని చెప్పారు. దుబ్బాకపై ఉన్న అభిమానంతో మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 35 కోట్లు కేటాయించామని చెప్పారు. సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్ పేటలో కొత్తగా నిర్మించిన గెస్ట్ హౌస్, అంబులెన్స్ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ హరీశ్ పై వ్యాఖ్యలు చేశారు.

Related Tags