పదవులపై మెత్తబడ్డ గులాబీ అసంతృప్త నేతలు.. కారణం అదేనా?

Trs high commend calls for Dissatisfied leaders in TRS party, పదవులపై మెత్తబడ్డ గులాబీ అసంతృప్త నేతలు.. కారణం అదేనా?

టీఆర్ఎస్‌ మేమూ ఓనర్లమేనంటూ ఇటీవల కొంతమంది ఆపార్టీ సీనియర్లు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పార్టీలో మంత్రివర్గ విస్తరణ మరింత మంట రాజేసింది. మంత్రి పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలకు విస్తరణలో మొండిచేయి చూపడంతో సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తంచేస్తున్నారు. రెండోసారి మంత్రి వర్గ విస్తరణలో తమకు ఖచ్చితంగా పదవులు దక్కుతాయని చాలమంది ఆశలు పెట్టుకున్నారు. వారిలో సీనియర్ నేత నాయని నర్సింహారెడ్డి, తాటికొండ రాజయ్య, బాజిరెడ్డి గోవర్ధన్, జూపల్లి కృష్ణారావులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే రెండోదఫాలో వీరికి ఛాన్స్ ఇవ్వలేకపోయారు సీఎం కేసీఆర్.  దీంతో వారు అసంతృప్తికి లోనైనట్టు వార్తలొచ్చాయి.

పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన గులాబీ బాస్ నష్ట నివారణ చర్యలు ముమ్మురం చేసినట్టుగా తెలుస్తోంది. అసంతృప్తితో ఉన్న నేతలకు త్వరలో మంచి పదవులు ఇవ్వనున్నట్టుగా సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు గులాబీ బాస్ ఫోన్లు కూడా చేసినట్టు సమాచారం. దీంతో అసమ్మతి గళం విప్పిన నేతలు ఒక్కక్కొరు నెమ్మదించినట్టుగా తెలుస్తోంది.

పదవి వస్తుందని ఆశపడి భంగపడ్డ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ తాను సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, భవిష్యత్తులో మాదిగలకు త్వరలోనే ఉన్నత పదవులు వస్తాయన్న నమ్మకం తనకు ఉందంటూ వ్యాఖ్యానించారు. మరో నేత జూపల్లి కృష్ణారావు సైతం తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ కొట్టిపారేశారు. ఇక మరో నేత బాజిరెడ్డి గోవర్ధన్ కూడా మంత్రి పదవి రాలేనందుకు బాధగా లేదంటూ సైలెంట్ అయ్యారు.
సీనియర్ నేతలు ఒక్కొక్కరు బయటకు వచ్చి వ్యాఖ్యలు చేయడంతో గులాబీ బాస్ వెంటనే వీరిని బుజ్జగించినట్టుగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *