Breaking News
  • ఢిల్లీ: మరో క్రీడా ఈవెంట్‌పై కరోనా ప్రభావం. మార్చి నుంచి జరగాల్సిన షూటింగ్‌ ప్రపంచకప్‌ రద్దు. అంతర్జాతీయ షూటింగ్‌ స్పోర్ట్ సమాఖ్య, భారత షూటింగ్ సంఘం నిర్ణయం.
  • హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌ ఎన్టీఆర్‌ గార్డెన్‌ దగ్గర కారు బీభత్సం. డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా, యువకుడికి గాయాలు. కారులో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో తప్పిన ప్రాణాపాయం. యువకుడిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు. కారులో మద్యం బాటిల్‌ లభ్యం. కేసు నమోదు చేసిన సైఫాబాద్‌ పోలీసులు.
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 32కు చేరిన కరోనా కేసులు. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట పరిధిలో 12 హాట్‌స్పాట్స్. లాక్‌డౌన్‌ను కఠినతరం చేసిన పోలీసులు. వేర్వేరు దేశాల నుంచి ట్రావెల్ చేసిన.. 814 మందికి 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి. ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్లలో 246 మంది అనుమానితులు. ఎంజీఎంలోని ఐసోలేషన్‌ వార్డులో 11 మంది అనుమానితులు.
  • కరోనా కట్టడి కోసం పీఎం కేర్స్‌కు భారీగా విరాళాలు. పీఎం కేర్స్‌కు రూ.52 కోట్ల విరాళం ఇచ్చిన 12 ప్రధాననౌకాశ్రయాలు.. షిప్పింగ్ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థలు.
  • ఏపీలో కరోనా పరీక్షా కేంద్రాల సామర్థ్యం పెంపు. విశాఖ, గుంటూరు, కడపలో కరోనా పరీక్షా కేంద్రాల సామర్థ్యం పెంపు. ప్రాథమిక స్థాయిలోనూ పరీక్షల నిర్వహణకు అనుమతులు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి 240 పరికరాలు. కొవిడ్‌-19పై సమీక్షలో సీఎం జగన్‌ వెల్లడి.

తహసీల్దార్లకు షాక్ .. ప్రత్యేక బాధ్యతల నుంచి తప్పిస్తూ ఆదేశాలు

KCR, తహసీల్దార్లకు షాక్ .. ప్రత్యేక బాధ్యతల నుంచి తప్పిస్తూ ఆదేశాలు

నగర పంచాయతీలు,మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న తహసీల్దార్లను వాటి నుంచి తప్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . వీరి స్ధానంలో ఎంపీడీవోలను నియమించింది. తహసీల్దార్లకు వర్క్ టు రూల్ అమల్లోకి తెచ్చి, వీరిని ఈనెల 15 నుంచి సామూహిక సెలవులు పెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బ‌దిలీ చేసిన త‌హ‌శీల్దార్ల‌ను తిరిగి పాత జిల్లాల‌కు బ‌దిలీ చేయాల‌ని తెలంగాణ త‌హ‌శీల్దార్ల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే జూలై 9 నుంచి 12 వరకు వర్క్ టు రూల్ ప్రకారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే పనిచేస్తామని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రానిపక్షంలో ఈనెల 15 నుంచి సామూహిక సెలవులు పెడతామని కూడా హెచ్చరించారు.

దీంతో తహసీల్దార్లు ఇచ్చిన అల్టిమేటంను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం వెంటనే వీరిని ప్రత్యేక అధికారుల బాధ్యతలనుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరి స్ధానంలో ఎంపీడీవోలకు బాధ్యతలను కూడా అప్పగించింది.

Related Tags