విమానాశ్రయాల హోరు… తెలంగాణ జోరు!

TRS Government Plans To Set Up 6 New Airports In Telangana

తెలంగాణ రాష్ట్రంలో మరో 6 విమానాశ్రయాల ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ని సంప్రదించింది. దీనికోసం కన్సల్టెన్సీ ఫీజుగా రూ. 4.5 కోట్లు చెల్లిస్తార‌ట‌. ఇప్పటికే రూ. 1.06 కోట్లను రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం స‌ర్వేకి సంబంధించిన ప‌నుల్ని అధికారులు మొద‌లు పెట్ట‌నున్నారు.

కొత్తగా విమానాశ్రయాల ప్ర‌తిపాద‌న చాలాకాలంగా వినిపిస్తున్న‌దే. వరంగల్, పెద్దపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయ‌నున్నారు. వరంగల్ స‌మీపంలో మామ్నూరులో, పెద్దపల్లి స‌మీపంలో బసంత్ నగర్‌లో, నిజామాబాద్ దగ్గర‌లోని జక్రాన్ పల్లిలో, ఆదిలాబాద్ టౌన్, కొత్త గూడెం, మహబూబ్‌నగర్ చేరువలోని అడ్డాకులలో ఏర్పాటు చేయడానికి ఇప్పటికే స్థలాలను గుర్తించారు.

ఈ అంశాల ప్రాతిపదికన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు.

  • ప్రతిపాదించిన ప్రాంతాల్లో విమానాశ్రయాల అవసరం ఉందా?
  • ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ డిమాండ్‌ ఏ స్థాయిలో ఉంటుంది?
  • ఇప్పటికే ఎయిర్‌ స్ట్రిప్‌లు ఉన్న ప్రాంతాల్లో స్థలం ఎంత ఉంది? అది సరిపోతుందా?
  • పూర్తిస్థాయిలో నిర్మించాల్సిన ప్రాంతాల్లో ఎంత స్థలం అవసరం?
  • ఆయా ప్రాంతాల్లో గడిచిన 5-6 దశాబ్దాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలమా? కాదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *