Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అకాలవర్షం భయపెడుతోంది. కర్నూలు, మహబూబ్‌నగర్‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతాల్లో జోరుగా వానపడింది. ఇటు వికారాబాద్‌ జిల్లా పర్గితో పాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోనూ వర్షం కురిసింది. వేసవి కాలంలో పడుతున్న ఈ అకాలవర్షంతో జనం బెంబేలెత్తారు. మామూలుగా అయితే ఈ వర్షాలకు జనం సేదతీరేవారే! కానీ కరోనా కాలం కావడంతో వైరస్‌ వ్యాప్తి చెందుతున్న భయం వెంటాడుతోంది
  • లాక్‌డౌన్‌పై ప్రజలకు పూర్తి అవగాహన ఉండటంతో మంచి సహకారమే అందుతోందని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌ కుమార్‌ తెలిపారు. అంతర్‌ రాష్ట్రాల మధ్య రాకపోకలను కట్టడి చేసేందుకు చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 5 వేల కేసులు నమోదుచేశామన్నారు.
  • ఆరోగ్యసేతు యాప్‌లో కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారంతోపాటు... వ్యాధి లక్షణాలు, దగ్గర్లో ఎక్కడెక్కడ హెల్త్‌ సెంటర్స్‌ ఉన్నాయన్న సమాచాం లభిస్తుంది. వీటితోపాటు మనం కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తి ప్రాంతానికి వెళ్తే అలర్ట్ వస్తుంది. అయితే కొన్నిచోట్ల ఈ యాప్‌ పనిచేయడం లేదు. దీంతో గందరగోళానికి పడిపోయిన వినియోగదారులు.
  • కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది.. . ఇవాళ భేటి అయిన కేంద్ర కేబినెట్‌ ఇందుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మహమ్మారిపై యుద్ధం చేయడానికి నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో పార్లమెంట్‌ సభ్యుల వేతనాల్లో 30 శాతం కోత విధించారు.. ఏడాది పాటు కోత ఉంటుంది.
  • కరోనా వ్యాధి ప్రబలడం తర్వాత మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనలను, అంతర్జాతీయ స్థాయిలో పాటించబడిన పద్దతులను మనం అనుసరిస్తున్నామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.

గులాబీ సిట్టింగులకు టెన్షన్.. సర్వే రిపోర్టు అదిరింది!

survey tension among sittings, గులాబీ సిట్టింగులకు టెన్షన్.. సర్వే రిపోర్టు అదిరింది!

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా గులాబీ నేతలకు టెన్షన్‌ పట్టుకుంది. టిక్కెట్‌ వస్తుందో రాదో అనే ఆందోళన వారిలో కన్పిస్తోంది. సగానికి పైగా సిట్టింగ్‌ల పని తీరు బాగోలేదని హైకమాండ్‌ సర్వేలో తేలింది. దీంతో సిట్టింగ్‌లకు టికెట్ల టెన్షన్‌ పట్టుకుంది. టికెట్లు రావని తెలిసి ఇతర పార్టీల నేతలతో టచ్‌లోకి వెళ్లాలని యోచిస్తున్నారట సిట్టింగ్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఒక కార్పొరేషన్‌తో పాటు ఆరు మునిసిపాలిటీలను క్లీన్‌ స్వీప్‌ చేయాలనే టార్గెట్‌గా టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గెలుపు గుర్రాల కోసం ఆ పార్టీ అన్వేషిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసినట్లే..మునిసిపాలిటీల్లోనూ గులాబీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు ప్లాన్‌ చేస్తున్నారు.

నిజామాబాద్‌ కార్పొరేషన్‌, ఆర్మూరు, భీంగల్‌ మునిసిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇస్తుండగా… కామారెడ్డి, బోధన్‌, ఎల్లారెడ్డిలో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ అన్నట్లుంది. బాన్సువాడలో ప్రతిపక్షాల ప్రభావం అంతంత మాత్రంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల గట్టి పోటీ ఉండడంతో.. గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్న ఎమ్మెల్యేలు….అభ్యర్థులు ఎవరైతే బాగుంటుదనే అంశంపై ఇంటర్నల్‌ సర్వే చేపట్టారు. డివిజన్ల వారీగా, అభ్యర్థుల వారీగా ఈ సర్వే జరిగినట్లు తెలుస్తోంది.

నిజామాబాద్‌ కార్పొరేషన్‌తో పాటు బోధన్‌, ఆర్మూర్‌, కామారెడ్డి మునిసిపాలిటీల్లో సగానికిపైగా సిట్టింగుల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు పార్టీ ఇంటర్నల్‌ సర్వేలో తేలింది. తీవ్ర వ్యతిరేకత ఉన్న నేతలను పక్కన పెట్టి…వేరే వారికి టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు నిర్ణయించినట్లు సమాచారం.

సిట్టింగ్‌లకు రిజర్వేషన్లు అనుకూలంగా రాకుండా ఎమ్మెల్యేలు జాగ్రత్తపడుతున్నారట. దీంతో వారికి టికెట్‌కు చెక్‌ పెట్టవచ్చు. వారు వేరే పార్టీ తరపున పోటీ చేయకుండా చేయవచ్చు అనే ఆలోచన చేస్తున్నారట. మిగతా మునిసిపాలిటీల పరిస్థితి ఎలా ఉన్నా..నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో మెజార్టీ సిట్టింగ్‌లకు టిక్కెట్లు దక్కే ఛాన్స్ లేదని ఆ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో టిక్కెట్ల టెన్షన్‌ సిట్టింగ్‌లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో డివిజన్లు 60కి పెరిగాయి. సమీప 9 గ్రామాల విలీనంతో చాలా డివిజన్ల సరిహద్దులు మారాయి. దీంతో రిజర్వేషన్లు సైతం పూర్తిగా మారే అవకాశం ఉంది. ఇటు రిజర్వేషన్లు అనుకూలించక… అటు సర్వేలో అనుకూల ఫలితాలు రాకపోవడంతో సగం మంది సిట్టింగ్‌లు ఇప్పుడు ఆందోళనగా ఉన్నారు. అవసరమైతే పక్క పార్టీ లేకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

Related Tags