Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 22 వేల 771 మంది వైరస్​ సోకింది. మరో 442 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,315. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,35,433. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,94,227. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,655.
  • చెన్నై నగరంలో మరికొన్ని ఆంక్షల సడలింపు. ఉ. 6.00 నుంచి రాత్రి 9.00 వరకు హోటళ్లు (పార్సిల్ సర్వీసు మాత్రమే). రాత్రి 9.00 వరకు మాత్రమే హోం డెలివరీ ఉ. 6.00 నుంచి సా. 6.00 వరకు టీ స్టాళ్లకు అనుమతి. కిరాణా షాపులు, కూరగాయల దుకాణాలు ఉ. 6 నుంచి సా. 6 వరకు. మాల్స్ మినహా మిగతా దుకాణాలు ఉ. 10 నుంచి సా. 6 వరకు. సడలింపులు జులై 6 నుంచి అమలు.
  • విశాఖ: కేజీహెచ్ సూపరెంటెండెంట్ డాక్టర్ అర్జున. క్లినకల్ ట్రయల్స్ కు కేజీహెచ్ ను ఎంపిక చేసునట్టు ఐసీఎంఆర్ నుంచి మెయిల్ వచ్చింది. క్లినికల్ ట్రయల్స్ కోసం ప్రభుత్వ అనుమతి కోరాం. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా - డీసీజీఐ క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఎథిక్స్ కమిటీ విధివిధానాలు తరువాత కార్యకలాపాలు ప్రారంభిస్తాం. అన్ని క్లియరెన్స్ లు పూర్తయ్యేందుకు 3 రోజుల సమయం పట్టే అవకాశముంది. ఆ తరువాత కేజీహెచ్ లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తాం.
  • కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు.. ఐసోలేషన్ సెంటర్లుగా మారిన బ్యూటీ పార్లర్లు. నిబంధనలను తుంగలో తొక్కి కోవిడ్ రోగులకు గదులు అద్దెకు ఇస్తున్న వైనం. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు గదులు అద్దెకు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లోని colours బ్యూటీ స్టూడియోలో కరోనా పాజిటివ్ వ్యక్తులకు అశ్రయం. రోజుకు రూ.10వేల ఫీజు.. వసూలు..గుట్టు చప్పుడు కాకుండా అక్రమ దందా.
  • REC, ఫైనాన్స్ కార్పొరేషన్ ల నుంచి 12600 కోట్ల రూపాయలు అప్పు తీసుకునేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలకు గ్యారెంటీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర సర్కార్. అప్పుల్లో కూరుకుపోయిన డిస్కమ్ లకు ప్రభుత్వ అనుమతితో ఊరట.
  • టీవీ9 తో సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా. తెలంగాణలో వైరస్ సమూల మార్పుని చోటుచేసుకుంటున్నాయి . ఇప్పటి వరకు తెలంగాణలో సింటమ్స్ కనిపించే a3i (ఏత్రీఐ) వైరస్ ఉండేది. ఇప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించని a2a (ఏటుఏ) వైర్ 90శాతం విస్తరించింది. కరోనా మృత దేహాల నుంచి వైరస్ వ్యాప్తి విషయంలో ఆందోళన వద్దు. డెడ్ బాడీస్ నుంచి వచ్చే వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువ. కరోనా వైరస్ ప్రభావం కేవలం ఊపిరితిత్తుల మీదేకాదు మిగిలిన అవయవాల పైనా ఉంది. చేస్తున్న టెస్టులకు పది రెట్లు అధికంగా చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ ల విధానం సిసిఎంబీలో అభివ`ద్ధి చేశాం. ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ ల పద్ధతి లో టెస్టింగ్ సమయంలో సగం ఆదా అవుతుంది. ఈ పద్దతిలో రోజుకి 500 టస్ట్లు చేసే చోట 1500 నుంచి 2000 వరకు చేయవచ్చు.
  • హైదరాబాద్ హిమాయత్ నగర్ లో కరోనా కలకలం. డైమండ్ వ్యాపారి పుట్టిన రోజు వేడుకల్లో వ్యాపించిన కరోనా. వేడుకల్లో పాల్గొన్న 20 మందికి కరోనా పాజిటివ్ . బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న సుమారు 150 మంది వ్యాపారులు , రాజకీయ నాయకులు . ఫంక్షన్ లో పాల్గొన్న ఒకరు చనిపోవడంతో మరింత ఆందోళనలు . ఈ వేడుకల్లో పాల్గొన్న ఇద్దరు రాజకీయ నాయకులకు సైతం సోకిన కరోనా

TRS vs BJP: కాషాయదళంతో గులాబీ యుద్దం

తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. నిధుల కేటాయింపుల్లో తేడాలపై మొదలైన వీరి మాటల మంటలు.. ప్రొటోకాల్ మర్యాదల ఉల్లంఘనల దాకా చేరుకుంది.
trs bjp leaders fighting, TRS vs BJP: కాషాయదళంతో గులాబీ యుద్దం

TRS and BJP leaders fighting together for funds and protocol: గులాబీ వర్సెస్‌ కమలం. తెలంగాణలో కొత్త ఫైట్‌ మొదలైంది. ఇన్నాళ్లు సిద్దాంత రాద్ధాంతం జరిగితే..ఇప్పుడు మర్యాద లొల్లి వచ్చి పడింది. మాకు మర్యాద ఇవ్వడం లేదని అంటే…మాకు మర్యాద ఇవ్వడం లేదని జగడాలకు దిగుతున్నారు. మరోవైపు నిధుల కేటాయింపుపై కూడా రెండు పార్టీల నేతలు పరస్పరం వాదులాడుకుంటున్నాయి. దీంతో ఈ అంశాలిప్పుడు పొలిటికల్‌ కాక రేపుతున్నాయి.

తెలంగాణలో ప్రొటోకాల్‌ కాల్‌ ఇష్యూ పొలిటికల్‌ కాక రేపుతోంది. మెట్రో రైల్‌ ప్రారంభానికి పిలవలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తే… దాన్ని ఖండించింది టీఆర్‌ఎస్‌. దీనిపై ఇంకా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ పాల్గొన్న కార్యక్రమ ఆహ్వాన పత్రికలో తన పేరు లేకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు మంత్రి తలసాని.

మెట్రో ప్రారంభోత్సవానికి తనను ఆలస్యంగా పిలిచారని…కనీస మర్యాదలు పాటించలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఆ తర్వాత ఆయన తాను స్వయంగా మెట్రోలో ప్రయాణించి…రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

చర్లపల్లి స్టేషన్‌ను శాటిలైట్‌ టెర్మినల్‌గా మార్చే ప్రోగ్రామ్‌కు తనను పిలవలేదన్నారు మంత్రి తలసాని. ఆహ్వానపత్రికలో తన పేరేలేదన్నారు. కావాలంటే తాను కూడా దీనిపై రాజకీయం చేయొచ్చన్నారు. కానీ తాము అలా చేయబోమని ఈ కార్యక్రమానికి ముందు స్పష్టం చేశారు తలసాని. మెట్రో ప్రారంభానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఫోన్‌ చేసి తానే స్వయంగా పిలిచానని క్లారిటీ ఇచ్చారు.

Also read: TRS leaders in new worry

ఆ తర్వాత కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ పాల్గొన్న కార్యక్రమానికి వెళ్లారు తలసాని. అక్కడ మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పక్కనే కూర్చుని కొద్దిసేపు మాట్లాడారు. ఈ సభలోనూ కేంద్రం తీరును తప్పుబట్టే ప్రయత్నం చేశారు మంత్రి తలసాని. రైల్వేల అభివృద్ధిలో దక్షిణాదిని చిన్న చూపు చూడొద్దని కోరారు. దీనికి కౌంటర్‌ ఇచ్చారు ఇద్దరు కేంద్రమంత్రులు. ఆనాటి UPA హయాంలో తెలంగాణలో రైల్వేకు 258 కోట్లు కేటాయిస్తే… తాము 2వేల 600 కోట్లు కేటాయించామన్నారు పీయూష్‌ గోయల్‌. మొత్తానికి ప్రోటోకాల్‌ ఇష్యూ బీజేపీ,టీఆర్‌ఎస్‌లో కాక రేపుతోంది. రేపు ఈ రాజకీయం ఇంకా ఎటూ దారితీస్తుందో చూడాలి.

Related Tags