డీఎస్‌పై చర్యలకు సిద్ధమైన టీఆర్ఎస్..?

TRS gets angry, డీఎస్‌పై చర్యలకు సిద్ధమైన టీఆర్ఎస్..?

కేంద్రమంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాను గురువారం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ కలిసిన విషయం తెలిసిందే. అమిత్‌ షాను ఆయన ఢిల్లీలో కలిశారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ ఎంపీలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీఎస్ వ్యవహారంపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన ఆధారాలు లభిస్తే అనర్హత వేటు కోసం రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

అయితే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి చేరిన డీఎస్.. గత కొన్ని రోజులుగా పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ బుధవారం జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన డీఎస్.. మరుసటి రోజే అమిత్ షానుకలవడం వెనుక ఏదైనా వ్యూహం ఉండే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారు. మరోవైపు ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్.. ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపు నుంచి పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *