Breaking News
  • విశాఖలో లైట్‌మెట్రోకు డీపీఆర్‌లు రూపొందించాలని ఆదేశాలు. ఏఎంఆర్సీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ. 79.91 కిలోమీటర్ల మేర లైట్‌మెట్రోకు ప్రతిపాదనలు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీ నుంచి సలహాలు తీసుకోవాలని ఆదేశం. 60.2 కి.మీ. మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్స్ ఏర్పాటుకు డీపీఆర్‌లు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీల నుంచి డీపీఆర్‌లు ఆహ్వానించాలని ఆదేశం.
  • నిర్భయ దోషులను విడివిడిగా ఉరితీయాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ. ఇప్పటికే తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం. రేపు తీర్పు ఇవ్వనున్న జస్టిస్‌ భానుమతి నేతృత్వంలోని.. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.67 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 46,448 మంది భక్తులు.
  • విశాఖ: పాయకరావుపేటలో హెటిరో ఉద్యోగి ఒంటెద్దు రాజు ఉరి వేసుకుని ఆత్మహత్య, మృతుడు తూ.గో.జిల్లా పెదపట్నం లంక వాసి.
  • ఢిల్లీ చేరుకున్న ట్రంప్‌ దంపతులు. ఎయిర్‌పోర్ట్‌లో ట్రంప్‌ దంపతులకు ఘనస్వాగతం. ఐటీసీ మౌర్య హోటల్‌లో ట్రంప్‌ దంపతుల బస. ఢిల్లీలో భారీగా భద్రతా ఏర్పాట్లు. ట్రంప్‌ బస చేసిన హోటల్‌ దగ్గర పటిష్ట భద్రత.

టిఆర్ఎస్-బిజెపిల మధ్య నిధుల చిచ్చు

funds fight between two parties, టిఆర్ఎస్-బిజెపిల మధ్య నిధుల చిచ్చు

తెలంగాణలో రెండు ప్రధాన పార్టీల మధ్య నిధుల చిచ్చు రగులుకొంది. కేంద్రం నుంచి దాదాపు 30 వేల కోట్లు నిధులు తెలంగాణకు రావాల్సి వుందని తెలంగాణ రాష్ట్ర సమితి అంటుంటే టిఆర్ఎస్ నేతలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని బిజెపి ఎంపీలు ఎదురు దాడి చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రానికి జీఎస్టీ సహా పలు రకాల కేంద్ర నిధులు పెండింగ్‌లో వున్నాయని ఆరోపిస్తూ బుధవారం పార్లమెంటు భవనం ఎదుట టిఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేశారు. మొత్తం 29 వేల 891 కోట్ల రూపాయలు వివిధ పద్దుల కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సి వుందని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిధుల విడుదలలో జాప్యం చేస్తుందని టిఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. పది రోజుల క్రితం ఇదే అంశంపై ప్రధాని మోదీని కల్వడానికి ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ సీఎం కెసీఆర్, ఆ తర్వాత అత్యవసర పనితో మోదీని కల్వకుండానే తిరిగి వచ్చేశారు.

ఆ తర్వాత తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో పోరాడాల్సిందిగా టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో కెసీఆర్, కెటీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే బుధవారం టిఆర్‌పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంటు భవనం ఎదుట బుధవారం ధర్నా చేశారు.

టిఆర్ఎస్ ఎంపీల ధర్నాపై బిజెపి ఎంపీలు స్సందించారు. గులాబీ ఎంపీలు పార్లమెంటు ఎదుట డ్రామాలు చేశారంటూ బిజెపి ఎంపీలు ముగ్గురు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. గత ఆరేళ్ళుగా కేంద్ర మిచ్చిన నిధులను కెసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించారని వారు ఆరోపించారు. బడ్జెట్ నిర్వహణలో భారీ అవకతవకలు, పెద్ద ఎత్తున అవినీతి, ఆర్థిక క్రమశిక్షణ ఏమాత్రం లేకపోవడం వంటి విధానాలతో తెలంగాణ ఆర్థిక పరిస్థితిని కెసీఆర్ గందరగోళంలోకి నెట్టారని బిజెపి ఎంపీలు అంటున్నారు.

మొత్తమ్మీద కేంద్రం నిధులు టిఆర్ఎస్, బిజెపి పార్టీల మధ్య మాటల యుద్దానికి తెరలేపాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల సంబంధాలు మరింత బలహీనపడ్డాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Related Tags