Breaking News
  • అమరావతి : బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నకు ఫీజు చెల్లించేందుకు పాలనా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం . బీసీజీకి 3 కోట్ల 51 లక్షల 5 వేల రూపాయల ఫీజును చెల్లించేందుకు ప్రణాళికా విభాగానికి అనుమతి మంజూరు . పాలనా వికేంద్రీకరణ, రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులపై మూడు విడతలుగా నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్. బీసీజీకి ప్రోఫెషనల్ ఫీజు కింద గతంలోనే 7 కోట్ల 2 లక్షల 10 వేలను మంజూరు చేసిన ఆర్ధిక శాఖ.
  • కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో ముగ్గురికి బెయిల్. ఎమ్మార్వో నాగరాజు పై మరో కేసు నమోదు కావడంతో బెయిల్ నిరాకరించిన ఏసీబీ కోర్ట్. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆంజిరెడ్డి, శ్రీనాథ్, విఆర్ఏ సాయి రాజ్ లకు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్ట్.
  • ఏసీపీ నర్సింహారెడ్డి ఏసీబీ కస్టడీ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా. ఏసీపీ నర్సింహారెడ్డి ని 5 రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏసీబీ అధికారులు. ఏసీబీ కస్టడీ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన ఏసీపీ నర్సింహారెడ్డి తరపు న్యాయవాది. వాదనలు విన్న ఏసీబీ కోర్ట్ విచారణకు ను రేపటికి వాయిదా.
  • సైబరాబాద్ కమిష్నరేట్ మొయినాబాద్ పొలిస్టేషన్ పరిధిలోని హిమయత్ నగర్ లో 25వ తేది అత్మహత్య చేసుకున్న ‌మహిళ కేసును చేదించిన మొయినాబాద్ పొలీసులు . అత్మహత్యకు కారకుడైనా భతుకు మధుసుధన్ యాదవ్ ను అదునులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు . కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.
  • వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సీఎం జగన్. జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్న మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ మాధవ్. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద బోరు బావులను తవ్వే రిగ్గు వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. రింగు వాహనాలతో నగరంలో భారీ ర్యాలీ.
  • చెన్నై: ఎస్పీ బాలు హాస్పిటల బిల్లుల వివాదంపై ఎంజీఎం ఆసుపత్రి యాజమాన్యం, ఎస్పీ చరణ్ సంయుక్త ప్రెస్ మీట్. మా ఆసుపత్రి మీద రూమర్లు సృష్టించవద్దు. బిల్లుల విషయంలో ఎలాంటి వివాదం లేదు. మేము ప్రతివారం బిల్లులు చెల్లిస్తూనే ఉన్నాము. చివర్లో బిల్లు కట్టవలసిన అవసరం లేదని ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది. కానీ మూడు కోట్ల బిల్లు అయిందని ఇంకా కోటిన్నర పెండింగ్ ఉందని అందుకనే నాన్నగారి భౌతిక కాయాన్ని అప్పగించలేదని కట్టు కథలు అల్లారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆయన కుమార్తె దీపా వెంకట్ బిల్లు చెల్లించారంటూ ప్రచారం చేశారు. మేము నాన్నని కోల్పోయి బాధలో ఉంటే మమ్మల్ని ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ఇంకా బాధ పెడుతున్నారు. తామరై పక్యం లో నాన్నగారి స్మృతి వనం నిర్మిస్తాము. నాన్నగారి కి భారత రత్న వస్తే సంతోషమే.. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు ఎప్పుడూ ఆయన భారతరత్నే. ఆయన ఏ ప్రోగ్రామ్ కి హాజరైనప్పుడు కరోనా సోకిందనేది ఇప్పుడు అప్రస్తుతం.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది..మేము నాన్నగారిని కోల్పోయాము. ఇప్పటికైనా నాన్నగారి మీద దుష్ప్రచారాలు ఆపండి.

ఛానల్ మారినా టాప్‌ రేటింగ్‌లో ‘రామాయణం’!

1987-88 మధ్య ఏడాదిన్నరపాటు ప్రసారం అయిన రామాయణ్ సీరియలల్ టెలివిజన్‌ చరిత్రలో ఓ ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది. అంతటి విశేష ప్రజాదరణ పొందిన ఈ సీరియల్ కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో మరోసారి

Ramayan Grabs Top Spot, ఛానల్ మారినా టాప్‌ రేటింగ్‌లో ‘రామాయణం’!

1987-88 మధ్య ఏడాదిన్నరపాటు ప్రసారం అయిన రామాయణ్ సీరియల్ టెలివిజన్‌ చరిత్రలో ఓ ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది. అంతటి విశేష ప్రజాదరణ పొందిన ఈ సీరియల్ కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో మరోసారి బుల్లితెరపై కనువిందు చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులు దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణం ప్రస్తుతం దంగల్‌ అనే ఛానల్‌లో ప్రసారమవుతోంది. తాజాగా బ్రాడ్‌ కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ (బార్క్‌) అందించిన నివేదిక ప్రకారం టెలివిజన్‌లో ఎక్కువ మంది తిలకించే కార్యక్రమాల్లో రామాయణం మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది.

ఆగస్టు 1 నుంచి 7 వరకు భారతీయ ప్రేక్షకులు టీవీల్లో ఏయే కార్యక్రమాలను ఎక్కువగా వీక్షించారనే దానిపై బార్క్ ఒక నివేదిక విడుదల చేసింది. దీని ఆధారంగా టీఆర్‌పీల పరంగా రామాయణం ఇప్పటికీ టాప్‌ రేటింగ్‌లో దూసుకుపోతుందని పేర్కొంది. జీ టీవీలో వస్తున్న శ్రద్ధా ఆర్య, ధీరజ్‌ ధూపర్‌ నటించిన కుండలి భాగ్య సీరియల్‌ రెండో స్థానంలో ఉంది. అలాగే మహిమా శనిదేవ్‌ కీ మూడవ స్థానంలో కొనసాగుతంది. దూరదర్శలో ప్రసారమవుతోన్న శ్రీ కృష్ణ నాలుగో స్థానం, స్టార్‌ ప్లస్‌లో ప్లే అవుతున్న అనుపమ అయిదో స్థానం దక్కించుకున్నాయి.

Read More:

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!

ఐపీఎల్ 2020: 10 సెక‌న్ల యాడ్‌కు రూ.10 ల‌క్ష‌లు..!

Related Tags