కోహ్లీని కెప్టెన్సీకి వీడ్కోలు పలకాలి.. నెట్టింట్లో తెగ ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్.. రవిశాస్త్రి ప్లేస్‌లో మరో కోచ్..!

ఆసీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 2-0తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఇక భారత్ రెండు వన్డేల్లోనూ ఘోరంగా ఓడిపోవడంతో..

  • Ravi Kiran
  • Publish Date - 10:50 pm, Mon, 30 November 20
కోహ్లీని కెప్టెన్సీకి వీడ్కోలు పలకాలి.. నెట్టింట్లో తెగ ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్.. రవిశాస్త్రి ప్లేస్‌లో మరో కోచ్..!

Trolls On Virat Kohli: ఆసీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 2-0తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఇక భారత్ రెండు వన్డేల్లోనూ ఘోరంగా ఓడిపోవడంతో కెప్టెన్ విరాట్‌ కోహ్లీపై నెట్టింట్లో విపరీతంగా ట్రోల్స్‌ వెల్లువెత్తాయి. ఈ వన్డేల్లో పరాజయం చెందటానికి విరాట్‌ కోహ్లికి కెప్టెన్సీ చేయడం చేతగాకేనని ఫ్యాన్స్ అంటున్నారు. రవి శాస్త్రిని ముందు టీం నుంచి బయటకు పంపాలంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేకాకుండా రోహిత్ శర్మ హ్యాష్ ట్యాగ్‌ను కూడా ట్రెండ్ చేస్తున్నారు.

అలాగే కోహ్లి, శాస్త్రి కాంబినేషన్‌లో మనం ఏ కప్పునూ గెలవలేమంటూ ఫ్యాన్స్ తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. టీం ఇండియా తన బ్రాండ్‌ను కాపాడుకోవాలంటే.. రవిశాస్త్రిని తీసేసి ఫారెన్‌ కోచ్‌కి టీమ్‌ను అప్పగించాలంటున్నారు. విరాట్‌ కోహ్లీ తన కెప్టెన్సీని రోహిత్ శర్మతో పంచుకోవాలని.. వన్డేలు, టీ20ల నుంచి కెప్టెన్‌గా తప్పుకుని బ్యాటింగ్‌పై శ్రద్ధపెట్టాలని సలహాలు ఇస్తున్నారు. గతంలో సచిన్‌ టెండూల్కర్‌ కూడా ఇలానే కెప్టెన్సీ ఇచ్చేశాడని.. ఇప్పుడు కోహ్లీ కూడా ఇచ్చేయాలంటున్నారు.

ఓవైపు రోహిత్‌ శర్మ వరుసగా ముంబై ఇండియన్స్‌ని విజేతగా నిలుపుతూ.. తన కెప్టెన్సీ ప్రతిభను కనబరుస్తుంటే.. కోహ్లీ వరుసగా ఫ్లాప్‌ అవుతున్నాడంటూ మండిపడుతున్నారు. భారత్‌ మరో ఆర్‌సీబీ కాకముందే తేరుకోవాలంటున్నారు. అయితే కోహ్లీ ఫ్యాన్స్‌ మాత్రం వీరికి గట్టిగా సమాధానం ఇస్తున్నారు. జట్టు విఫలమైతే కోహ్లీని నిందించడం తగదంటున్నారు.