Breaking News
  • సామాజిక దూరాన్ని పాటించాలని ఎంత చెబుతున్నా షాపుల దగ్గర మాత్రం ఆ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు. షాపుల దగ్గర సోషల్‌ డిస్టెన్సింగ్‌ కనిపించడం లేదు. ధరల పట్టికలను పెట్టడం లేదు. విజయవాడలాంటి పెద్ద పెద్ద నగరాలలో కూడా ఇదే పరిస్థితి. అసలే విజయవాడలో నాలుగు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అయినా అక్కడ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు జనం.. పక్కపక్కనే నిలబడి సరకులు కొనుక్కుంటున్నారు.
  • ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కాంటాక్టు కేసులు పెరగడంతో ఎవరెవరు ఢిల్లీకి వెళ్లి వచ్చారన్నది ఆరా తీస్తున్నారు అధికారులు. జిల్లాల వారిగా ప్రత్యేక బృందాలు ఆ పనిలోనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మందిని గుర్తించారు. వారందరిని క్వారంటైన్‌కు తరలించారు.
  • విజయవాడలోనే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు రావడంతో మరింత అప్రమత్తమయ్యారు కృష్ణా జిల్లా అధికారులు. సిటీలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఇక విజయవాడ నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో బంద్‌ పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు.
  • ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఎంత చితక బాదినా.. ఒళ్లు హూనం చేసినా.. వాళ్లు మాత్రం మారడం లేదు. మరికొందరికి ముప్పు కొని తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. బరి తెగించిన బద్మాష్‌గాళ్లు పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. ఏ పాపం ఎరుగని అమాయకులకి.. కరోనా మాయ రోగాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
  • నిరాడంబరంగా భద్రాద్రి శ్రీరామనవమి వేడుకలు. వేడుక‌లకు భక్తులకు అనుమతి లేదు.ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేడుకలను టీవీల్లో వీక్షించాలని విజ్ఞప్తి. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించవద్దు. శ్రీరామనవమి వేడుకలపై ఉత్తర్వులు జారీచేసిన దేవాదాయ శాఖ.

ఎన్టీఆర్‌ కోసం త్రివిక్రమ్ కథ.. ఈసారి ఏ బ్యాక్‌డ్రాప్ అంటే..!

Trivikram movie news, ఎన్టీఆర్‌ కోసం త్రివిక్రమ్ కథ.. ఈసారి ఏ బ్యాక్‌డ్రాప్ అంటే..!

‘అల వైకుంఠపురములో’ చిత్రంతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్‌తో రెండోసారి పనిచేసేందుకు సిద్ధమైన త్రివిక్రమ్.. ఈ మధ్యన అతడికి కథను కూడా వినిపించినట్లు తెలుస్తోంది. ఇక ఈ కథను విన్న ఎన్టీఆర్.. దానికి ముగ్దుడయ్యారని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ మూవీకి స్క్రిప్ట్‌ తయారు చేసే పనిలో త్రివిక్రమ్ పడ్డట్లు తెలుస్తోంది.

కాగా ఎన్టీఆర్‌తో ఇదివరకు అరవింద సమేతను తెరకెక్కించారు త్రివిక్రమ్. ఫ్యాక్షన్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కగా.. ఈసారి మాత్రం యంగ్ టైగర్ ‌కోసం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నారట ఈ డైరక్టర్. ఇక ఈ స్క్రిప్ట్‌ మే లేదా జూన్‌కు పూర్తి కానుందని సమాచారం. ఆ తరువాత ఆర్ఆర్ఆర్ షూటింగ్ నుంచి ఎన్టీఆర్ బయటకు వచ్చిన తరువాత వీరిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్లుగా పూజా హెగ్డే, రష్మిక పేర్లు వినిపిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించబోతోంది.

Related Tags