ధైర్యానికి, సాహసానికి మధ్య తేడా అదేః త్రివిక్రమ్

పంచ్‌లు, ప్రాసలతో వెండితెరపై ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరోసారి తన మాటలతో మాయ చేశాడు. అయితే ఇది స్క్రీన్ మీద కాదండీ.. టీవీ9 నవ నక్షత్ర సన్మానంలో. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా విచ్చేసిన ఆయన రియల్ అన్‌సంగ్ హీరోలను అవార్డులతో సత్కరించారు. ఇక ఆ తర్వాత ప్రసంగించిన త్రివిక్రమ్ తనదైన శైలి మాటలతో అందరిని ఆకట్టుకున్నారు. అందరూ హిస్టరీని క్రియేట్ చేస్తే.. తెలంగాణ అనే స్టేట్ ద్వారా మీరు జియోగ్రఫీని క్రియేట్ చేశారని […]

ధైర్యానికి, సాహసానికి మధ్య తేడా అదేః త్రివిక్రమ్
Follow us

|

Updated on: Dec 30, 2019 | 11:34 AM

పంచ్‌లు, ప్రాసలతో వెండితెరపై ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరోసారి తన మాటలతో మాయ చేశాడు. అయితే ఇది స్క్రీన్ మీద కాదండీ.. టీవీ9 నవ నక్షత్ర సన్మానంలో. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా విచ్చేసిన ఆయన రియల్ అన్‌సంగ్ హీరోలను అవార్డులతో సత్కరించారు. ఇక ఆ తర్వాత ప్రసంగించిన త్రివిక్రమ్ తనదైన శైలి మాటలతో అందరిని ఆకట్టుకున్నారు.

అందరూ హిస్టరీని క్రియేట్ చేస్తే.. తెలంగాణ అనే స్టేట్ ద్వారా మీరు జియోగ్రఫీని క్రియేట్ చేశారని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి త్రివిక్రమ్ పసందైన మాటలు మాట్లాడారు. అంతేకాకుండా అన్‌సంగ్ హీరోలను సత్కరించాలనే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన టీవీ9కి ప్రత్యేక అభినందనలు చెప్పిన ఆయన గుర్రం మాస్టర్ వెంకటరమణ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్‌లో తన జీవితం టీచర్‌గానే మొదలైందన్న త్రివిక్రమ్ అప్పట్లో రెండు ట్యూషన్లు చెప్పుకుంటూ ఉండేవాడినని తెలిపారు. నాడు జూబ్లీ హిల్స్‌లో ఎత్తయిన రోడ్డు ఉండేదని.. కింద నుంచి పైకి లూనాను తోసుకుంటూ ఎక్కానని.. అప్పుడప్పుడూ ఇంత కష్టం ఎందుకు పడుతున్నానో అని బాధపడేవాడినని అన్నారు.

అయితే ఇప్పుడు గుర్రం మాస్టర్ కథ విన్నాక ఆయన కష్టం ముందు తన కష్టం చాలా చిన్నదనిపించిందని తెలిపారు. పాడేరు కొండను ఈయన ఏకంగా గుర్రంతో ఎక్కుతున్నాడంటే చాలా గ్రేట్ అని అన్నారు. మరోవైపు ధైర్యానికి, సాహసానికి మధ్య ఉన్న తేడాను చెప్పిన త్రివిక్రమ్.. ధైర్యం అంటే ఆ క్షణంలో తెగించి చేసేదని.. కానీ సాహసం అంటే ఆ కష్టం ఏమిటో తెలిసి.. దాని లోతు ఎంతో తెలిసి .. ఆ పని జరగకపోవచ్చని అపనమ్మకం ఉన్నా.. తెగించి దైర్యంగా ముందుకు వెళ్లేదని.. కాబట్టి వీళ్ళందరూ ధైర్యవంతులు కాదు.. సాహసవంతులని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా ఈ సన్మానం తనకు ఎంతగానో నచ్చిందని.. 15 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటాన్ని నడిపించిన ఒక సాహసవంతుడైన వ్యక్తి(కేసీఆర్) ముందు ఇలాంటి సాహసవంతుల గురించి ఒక టీవీ చెప్పడం చాలా సంతోషంగా ఉందని చెబుతూ త్రివిక్రమ్ తన స్పీచ్‌ను ముగించారు.