ఈ మ్యూజికల్ నైట్ వెనుక అసలు కారణమిదే..!

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ మాట్లాడుతూ..’ఈవెంట్ నిర్వహణలో భాగమైన అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఓ రూమ్‌లో మ‌ధ్యాహ్నం 3-4 గంట‌ల ప్రాంతంలో పెద్ద‌గా ట్రాఫిక్ లేని స‌మ‌యంలో 30 ఏళ్ల యువ‌కుడు, 60 ఏళ్ల పెద్దాయ‌న కూని రాగం తీసుకుంటూ రాసిన పాట కొన్ని కోట్ల మంది హృద‌యాల‌ను తాకింది. అదే సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న. […]

ఈ మ్యూజికల్ నైట్ వెనుక అసలు కారణమిదే..!
Follow us

|

Updated on: Jan 07, 2020 | 5:31 PM

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ మాట్లాడుతూ..’ఈవెంట్ నిర్వహణలో భాగమైన అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఓ రూమ్‌లో మ‌ధ్యాహ్నం 3-4 గంట‌ల ప్రాంతంలో పెద్ద‌గా ట్రాఫిక్ లేని స‌మ‌యంలో 30 ఏళ్ల యువ‌కుడు, 60 ఏళ్ల పెద్దాయ‌న కూని రాగం తీసుకుంటూ రాసిన పాట కొన్ని కోట్ల మంది హృద‌యాల‌ను తాకింది. అదే సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న. త‌న వ‌య‌సు నుంచి దిగి ఆయ‌న‌, త‌న వ‌య‌సును ఎక్కి త‌మ‌న్ క‌లిసి ఓ కామన్ పాయింట్‌ను క‌లిపి ఈ చిత్రానికి స్థాయిని తీసుకొచ్చారు. మా గుండెలు ప‌ట్ట‌నంత ఆనందాన్ని మీకు వినిపించేయాలి.. మా క‌ళ్ల‌ల్లో వ‌చ్చిన నీటి చుక్క మీ అంద‌రి క‌ళ్ల‌ల్లోకి ఎలా రావాలి. ఓ సాయంత్రం కారులో వెళ్లే అబ్బాయి త‌న ప్రేయ‌సి గుర్తు తెచ్చుకుంటూ.. అలాగే సాయంత్రం త‌న‌ను చూస్తున్న యువ‌కుడిని చూడ‌న‌ట్లు న‌టిస్తూ త‌న హెడ్ ఫోన్స్‌లో విన‌డానికి ఒక అత్య‌ద్భుత‌మైన క‌ళ్ల‌ని, ఒక జ్ఞాప‌కాన్ని ఇద్ద‌రూ మ‌న‌కు ఇచ్చారు. దానికి త‌న‌కు గొంతునిచ్చి సిద్ శ్రీరామ్ ఈ పాట‌ను మ‌న అంద‌రి గుండెల్లోకి తీసుకొచ్చేశాడు. ఓ పాట మ‌న‌కు ఊతం చేయి ప‌ట్టుకుని న‌డ‌వొచ్చు.. ఓ పాట మ‌న‌కు స్నేహితురాలు మ‌న క‌ష్టాలు చెప్పుకోవచ్చు.

అది మ‌న ప్రేయ‌సి త‌న ఒళ్లో మ‌న త‌లను పెట్టుకుని ప్రేమ‌ను పొంద‌వ‌చ్చు. మ‌న గురువు.. మ‌న‌కు అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు మ‌న‌కు జ్ఞానాన్ని బోధిస్తుంది అలాంటి పాట‌ను ఇచ్చిన వారిని గౌర‌వించాల‌నిపించింది. అందుకే దీనికి మ్యూజిక‌ల్ నైట్ పేరు పెట్టి కండ‌క్ట్ చేశాం. ఈ కోరిక‌ను బ‌లంగా మ‌న ముందుకు తీసుకొచ్చింది అల్లు అర్జున్‌. జులాయిలో పెళ్లి కానీ అబ్బాయిగా తెలుసు. ఇప్పుడు ఇద్ద‌రి పిల్ల‌ల తండ్రిగా త‌న తాలూకు మెచ్యూరిటీని త‌న మాట‌లు, జీవితంలో, ప‌నిలో ప్ర‌తి దాంట్లో పెడుతున్నాడు. మేం క‌నే క‌ల మీ అంద‌రికీ మంచి జ్ఞాప‌కం కావాలి. దీని కోసం మేం ఎంత అడ్వేంచ‌రెస్‌గా నిర్ణ‌యాలు తీసుకున్నా, మీ వెనుక మేం ఉన్నామంటూ అర‌వింద్‌గారు, చిన్న‌బాబుగారు నిల‌బ‌డి మేం అడిగిదానల్లా గొప్ప‌గా ఇచ్చారు. ఇంత గొప్ప సంగీతాన్ని అందించిన ప్ర‌తి ఒక్క‌రికీ మ‌న‌స్ఫూర్తిగా నా ఆశీస్సులు అందిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ర‌కంగా మ‌న‌సుకు ద‌గ్గ‌రైన వాళ్లే. వాళ్లంద‌రికీ నేను చెప్పే మాట ఒక‌టే.. వాళ్లంద‌రితో నేను ప్రేమ‌లో ఉన్నాను. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత కొద్దిపాటి విర‌హాన్ని అనుభ‌విస్తాను. మ‌ళ్లీ ఓ క‌థ‌ను రాస్తాను. మ‌ళ్లీ మిమ్మ‌ల్ని క‌లుస్తాను. ఈ సినిమాకు మొద‌లు, చివ‌ర అల్లు అర్జునే. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్న‌ప్పుడు ఏదీ చేసినా హ్యాపీగా చేద్దాం సార్ అని అన్నాడు. అప్ప‌టి నుండి 11 నెల‌లు పాటు ఈ జ‌ర్నీ చేశాం. మేం కాకినాడ‌లో షూటింగ చేస్తున్న‌ప్పుడు పాట‌ల లిరిక‌ల్ వీడియోలు రొటీన్‌గా ఉన్నాయి.

పాట కోసం ప‌నిచేసి టెక్నీషియ‌న్స్ క‌నిపించేలా ఏదైనా కొత్త‌గా చేద్దామ‌ని ఆయ‌న అన్నారు. అదే మీరు చూసిన సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న పాట‌.. అలా నాతో స‌హా అంద‌రినీ ఎంతో ఇన్‌స్పైర్ చేశారు. ఆయ‌న లైఫ్‌లో ఇంకా చాలా ముందుకు వెళ్లాల‌ని కోరుకుంటున్నాను. ఆ ప్ర‌యాణంలో మేం కూడా భాగ‌మ‌వుతాం. మేం ప‌నిచేయ‌లేని సినిమాల‌కు మేం సాక్షుల‌మ‌వుతాం, ప్రేక్ష‌కుల‌మ‌వుతాం. మేం ప‌నిచేసే సినిమాల‌కు ద‌ర్శ‌కుల‌మ‌వుతాం. అంద‌రి ప్రేమ మాపై ఇలాగే ఉండాలి. 12న క‌లిసి పండ‌గ చేసుకుందాం. ఆనందంగా ఉంది. అల వైకుంఠ‌పుర‌ములో మీకు స్వాగతం ప‌లుకుతుంది“ అన్నారు.

కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!