మహిళా క్రికెటర్ ఆత్మహత్య..పలువురి సంతాపం

త్రిపురలో దారుణం చోటుచేసుకుంది.. భార‌త మ‌హిళ‌ల‌ అండర్ -19 జ‌ట్టుకు చెందిన‌ క్రీడాకారిణి అయంతి రీయాంగ్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది...చిన్న‌ప్ప‌టి నుంచి ఆట‌ల్లో చురుగ్గా ఉండే అయంతిని త‌ల్లిదండ్రులు..

మహిళా క్రికెటర్ ఆత్మహత్య..పలువురి సంతాపం
Follow us

|

Updated on: Jun 17, 2020 | 6:53 PM

త్రిపురలో దారుణం చోటుచేసుకుంది.. భార‌త మ‌హిళ‌ల‌ అండర్ -19 జ‌ట్టుకు చెందిన‌ క్రీడాకారిణి అయంతి రీయాంగ్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. మంగ‌ళ‌వారం రాత్రి ఆమె త‌న నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. త్రిపుర రాజ‌ధాని అగ‌ర్త‌లా నుంచి 90 కిలోమీట‌ర్ల దూరంలోగ‌ల‌ ఉద‌య‌పూర్ ఏరియాలోని తెనాని అయంతి స్వ‌గ్రామం.

అయంతీ త‌న త‌ల్లిదండ్రుల‌కు నాలుగో సంతానం. కాగా, చిన్న‌ప్ప‌టి నుంచి ఆట‌ల్లో చురుగ్గా ఉండే అయంతిని త‌ల్లిదండ్రులు కూడా ప్రోత్స‌హించారు. దీంతో, క్రికెట్‌లో ఒక్కోమెట్టు ఎక్కుతూ ఏడాది క్రితం భార‌త అండర్‌-19 జ‌ట్టుకు ఎంపికైంది. అంతేగాకుండా రాష్ట్రం త‌ర‌ఫున కూడా టి-20 జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ది. త్రిపుర అండర్-23 జ‌ట్టులో కూడా ఆమె స‌భ్యురాలిగా కొన‌సాగుతున్న‌ది. కాగా, అయంతి మృతిప‌ట్ల ప‌లువురు క్రీడా ప్ర‌ముఖులు‌ సంతాపం వ్య‌క్తం చేశారు. రాష్ట్రం ప్రతిభావంతురాలైన క్రీడాకారిణిని కోల్పోయింద‌ని త్రిపుర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి తిమురా చందా సంతాపం వ్యక్తం చేశారు.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..