దీదీ అహంకారం.. అబ్బో: మోదీ ఫైర్

ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో ఫొని తుఫాను సృష్టించిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆయా రాష్ట్రాల పర్యటనకు పూనుకున్నారు. ఇందులో భాగంగా ఈ ఉదయం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో కలిసి ఆ రాష్ట్రవ్యాప్తంగా ఏరియల్ సర్వే చేసిన మోదీ.. నష్టపరిహారంగా ఇప్పటికే రూ.381కోట్లు ఇచ్చామని, మరో వెయ్యి కోట్లు ఇస్తామని ప్రకటించారు. అయితే పశ్చిమ బెంగాల్‌కు కూడా తాను వెళ్లాలని భావించినప్పటికీ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖం చాటేసిందని ఆయన […]

దీదీ అహంకారం.. అబ్బో: మోదీ ఫైర్
Follow us

| Edited By:

Updated on: May 06, 2019 | 4:55 PM

ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో ఫొని తుఫాను సృష్టించిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆయా రాష్ట్రాల పర్యటనకు పూనుకున్నారు. ఇందులో భాగంగా ఈ ఉదయం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో కలిసి ఆ రాష్ట్రవ్యాప్తంగా ఏరియల్ సర్వే చేసిన మోదీ.. నష్టపరిహారంగా ఇప్పటికే రూ.381కోట్లు ఇచ్చామని, మరో వెయ్యి కోట్లు ఇస్తామని ప్రకటించారు. అయితే పశ్చిమ బెంగాల్‌కు కూడా తాను వెళ్లాలని భావించినప్పటికీ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖం చాటేసిందని ఆయన అన్నారు.

‘‘సైక్లోన్ ఫొని మీద కూడా మమతా రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఆమెతో మాట్లాడేందుకు నేను రెండు సార్లు ప్రయత్నించా.. కానీ స్పందించలేదు. ఆమె అహంకారి’’ అంటూ ఘాటుగా మోదీ విమర్శించారు. కాగా ఎన్నికల వేళ మోదీ, మమతా బెనర్జీల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది.