Ramatheertham: రామతీర్థంలో పర్యటించిన త్రిదండి చిన జీయర్ స్వామి.. రామాలయాన్ని ఏడాదిలోపు పూర్తి చేయాలని డిమాండ్..

Ramatheertham: రామతీర్థం ఆలయాన్ని ఏడాదిలోపు పూర్తి చేయాలని త్రిదండి చిన జీయర్ స్వామి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Ramatheertham: రామతీర్థంలో పర్యటించిన త్రిదండి చిన జీయర్ స్వామి.. రామాలయాన్ని ఏడాదిలోపు పూర్తి చేయాలని డిమాండ్..
Follow us

|

Updated on: Jan 14, 2021 | 5:32 PM

Ramatheertham: రామతీర్థం ఆలయాన్ని ఏడాదిలోపు పూర్తి చేయాలని త్రిదండి చిన జీయర్ స్వామి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నాడు చిన జీయర్ స్వామి విజయనగరంలోని రామతీర్థంలో గల రామాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చిన జీయర్‌కు స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసిన అనంతరం ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సంవత్సరం లోపు రామతీర్థ ఆలయ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఇదొక్కటే కాదు.. రాష్ట్రంలోని ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని చిన జీయర్ డిమాండ్ చేశారు. కాగా, ధనుర్మాసం పూర్తి కాగానే మొదటిగా తాను రామతీర్థం వచ్చానని పేర్కొన్నారు. రామతీర్థం ఆలయ నిర్మాణానికి కావలసిన ఆగమ శాస్త్ర సూచనలు చేశామన్నారు. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. రామతీర్థం ఘటన పరాకాష్టకు నిదర్శనం అన్నారు. చాలా సాధారణంగా తన ఆలయ దర్శన యాత్ర కొనసాగుతుందని చిన జీయర్ స్వామి తెలిపారు.

రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో పెను ప్రకంపనలు సృష్టించింది. రాజకీయంగా తీవ్ర అలజడి రేగింది. అయితే, రామతీర్థం ఘటనపై త్రిదండి చిన జీయర్ స్వామి కూడా తీవ్రంగా స్పందించారు. ఆ ఘటనను ఆయన ఖండించారు. ఈ క్రమంలో రామతీర్థం ఆలయాన్ని సందర్శిస్తానని ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో కీలక ఆలయాలను సందర్శిస్తానని చెప్పారు. అయితే ఇన్నిరోజులు చిన జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో విజయకీలాద్రిపై ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించారు. తాజాగా ధనుర్మాస ఉత్సవాలు ముగియడంతో ఇవాళ ఆయన రామతీర్థం ఆలయాన్ని దర్శించారు. తొలుత చిన్న జీయర్ స్వామి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయనగరంలోని రామతీర్థానికి చేరుకున్నారు.

Also read:

Salaar movie : సెట్స్ పైకి ప్రభాస్ కొత్తసినిమా.. ‘సలార్’కు ముహూర్తం ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్

Corona Cases AP: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే..!