Viral Pic: ఈ ఫోటోలో దెయ్యం ఉందట.. మీరు కూడా చూశారా..! వైరల్ అవుతున్న పిక్..

ప్రతీ ఒక్కరికి భయం అనేది సహజం. కొందరికి నీటిని చూస్తే.. మరికొందరికి ఎత్తైన ప్రదేశాలు అంటే భయం.. మరికొందరికి..

Viral Pic: ఈ ఫోటోలో దెయ్యం ఉందట.. మీరు కూడా చూశారా..! వైరల్ అవుతున్న పిక్..
Horror
Follow us

|

Updated on: May 28, 2021 | 1:58 PM

ప్రతీ ఒక్కరికి భయం అనేది సహజం. కొందరికి నీటిని చూస్తే.. మరికొందరికి ఎత్తైన ప్రదేశాలు అంటే భయం.. మరికొందరికి పాములంటే భయం.. ఇలా రకరకాల వాటికి మనుషులు భయపడుతుంటారు. అయితే అందరిలోనూ కామన్‌గా ఉండే భయం పేరు ‘దెయ్యం’. చాలామందికి దెయ్యాలంటే చచ్చేంత భయం.

ఇదిలా ఉంటే దెయ్యాలపై పరిశోధనలు చేసేవారు.. అవి ఉన్నాయంటూ కొన్ని ఆధారాలు చూపిస్తుంటారు. కానీ వాటిని నమ్మరు. అందుకే ఇప్పటికీ దెయ్యాల కాన్సెప్ట్‌పై వాటిని నమ్మేవారు, నమ్మని వారి మధ్య తరచూ చర్చలు జరుగుతుంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా బాగా విస్తరించడంతో యువత ఈ దెయ్యాల కాన్సెప్ట్స్‌పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

తాజాగా ఇంగ్లాండ్‌కు చెందిన రెబెకా గ్లాస్‌బరో అనే మహిళ తన స్నేహితులతో కలిసి అక్టోబర్‌లో.. తన ఇంట్లోనే చిన్న పార్టీ చేసుకుంది. ఇక ఆ మధుర క్షణాలను గుర్తుగా ఉంచుకునేందుకు అందరూ కలిసి ఫోటోలు కూడా దిగారు. కొంతకాలం తర్వాత ఆ మహిళ పార్టీ ఫోటోల ఆల్బమ్‌ను చూసింది. అన్ని ఫోటోలను చూసుకుంటే.. అన్నింటిలోనూ అందరికంటే చివరన ఓ ఆకారం కనిపిస్తోంది. అచ్చం అమ్మాయి మాదిరిగా ఓ రూపం కంటపడింది. ఎవరా అని తీక్షణంగా చూడగా.. అది దెయ్యంలా అనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి కాస్తా వైరల్‌గా మారాయి.

రెబెకా ఉంటున్న ఇంట్లో ఇంతకముందు నివసించిన వారు చనిపోయారని ప్రచారం ఉందట. ఇక ఆ ఫోటోలోని ఆకారం రెబెకాకు తప్ప.. ఆమె స్నేహితులకు కనిపించలేదట. దానితో ఈ సంఘటన జరిగినప్పటి నుంచి సదరు యువతి భయపడుతూనే ఉంది. ఇక ఈ ఫోటోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు., కొంతమంది ఆ ఫోటో చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోందని అంటుంటే.. మరికొందరు అది నిజం కాదని కొట్టి పారేస్తున్నారు.

Also Read:

మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?

టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?

సర్కస్‌ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!